కొడుకు, మనవళ్లను ఇంటి నుంచి గెంటేయాలని కోర్టును ఆశ్రయించిన వ్యక్తి
- November 30, 2022
యూఏఈ: అల్ ఐన్‌కు చెందిన ఒక వ్యక్తి తన కొడుకు, మనవళ్లను తన ఇంటి నుండి గెంటేయాలని డిమాండ్ చేస్తూ కోర్టులో దావా వేశాడు. కోర్టు ఫైల్స్ ప్రకారం..సదరు వ్యక్తి తన ఇంటిని అద్దెకు ఇవ్వాలని నిర్ణయించాడు. కానీ తన కొడుకు, కోడలు, మనవరాళ్లతో తాత్కాలికంగా ఉండడానికి అనుమతించాడు. కొన్ని రోజులకు అద్దెకు ఇవ్వాలని ఇంటిని వెళ్లాలని కొడుకుకు చెప్పగా.. అతడు వెళ్లేందుకు నిరాకరించాడు. తన కొడుకుకి ఇప్పటికే మరొక ఇల్లు ఉందని సదరు వ్యక్తి తన దావాలో పేర్కొన్నాడు. మరోవైపు 10 సంవత్సరాల క్రితం తన తండ్రితో కుదుర్చుకున్న మౌఖిక ఒప్పందం ప్రకారం.. ఇంటి నిర్మాణం కోసం Dh320,000 మొత్తాన్ని ఇచ్చినట్లు కొడుకు కోర్టుకు తెలిపాడు. కేసును కొట్టివేయాలని కోర్టును అభ్యర్థించాడు. అల్ ఐన్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ గతంలో కొడుకు ఆస్తిని వదిలి వెళ్లాలని తీర్పునిచ్చింది. కుమారుడు అప్పీల్స్ కోర్టులో తీర్పును సవాలు చేయగా.. కోర్టు తిరస్కరించింది. అలాగు తన తండ్రి న్యాయపరమైన ఖర్చులు కూడా చెల్లించాలని కొడుకును కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- ఘోర ప్రమాదం.. బస్సులోని 18 మంది ప్రయాణికులు మృతి..
- వాట్సాప్‌లో ఇన్స్టాగ్రామ్ ‘యూజర్ నేమ్’ ఫీచర్..
- ఉచిత బస్సుల పై వెంకయ్య నాయుడు ఫైర్
- మంగళగిరి ఎయిమ్స్ లో త్వరలో ట్రామా సెంటర్: ఎంపీ బాలశౌరి
- అమెరికాలో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా గాంధీజయంతి వేడుకలు
- డా.బంగారి రజనీ ప్రియదర్శినికి టైమ్స్ ఆఫ్ ఇండియా హెల్త్ కేర్ ఐకాన్ అవార్డ్
- ఎస్ఎస్ఆర్ హోటల్స్ కు స్వచ్ఛ ఆంధ్రా అవార్డు..!!
- జ్లీబ్ సమస్యకు వర్కర్స్ సిటీస్ తో చెక్..!!
- BD7,000 విలువైన గోల్డ్ జివెల్లరీ చోరీ..మహిళ అరెస్టు..!!
- కస్టమ్స్ యాప్ ద్వారా కార్లు, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్ వేలం..!!