స్నేహితుల కోసం వీసా.. సౌదీలకు ప్రత్యేక స్కీమ్

- December 03, 2022 , by Maagulf
స్నేహితుల కోసం వీసా.. సౌదీలకు ప్రత్యేక స్కీమ్

రియాద్: తమ స్నేహితులు, పరిచయస్తులను సౌదీ అరేబియాకు తీసుకురావడానికి సౌదీ పౌరులు వ్యక్తిగత సందర్శన వీసాలు పొందేందుకు సౌదీ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొత్త విధానాన్ని ప్రకటించింది. వీసా హోల్డర్లు రాజ్యంలోని ప్రాంతాలు, నగరాల్లో ప్రయాణించడానికి అలాగే ఉమ్రా చేయడానికి, మదీనాలోని ప్రవక్త మస్జీదును సందర్శించడానికి, మతపరమైన, చారిత్రక ప్రదేశాలను సందర్శించడంతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడానికి అనుమతించబడతారని తెలిపింది. ఇందుకోసం సౌదీ పౌరులు మంత్రిత్వ శాఖ eVisa ప్లాట్‌ఫారమ్‌లో వ్యక్తిగత సందర్శన కోసం అభ్యర్థనను సమర్పించాల్సి ఉంటుంది. వ్యక్తిగత సందర్శన వీసా అభ్యర్థనను eVisa ప్లాట్‌ఫారమ్‌లోని వ్యక్తిగత సేవా విభాగం ద్వారా సమర్పించాలి. అందిన అభ్యర్థనలను ప్రాసెస్ చేసి 'వ్యక్తిగత సందర్శన వీసా పత్రం' జారీ చేయబడుతుంది.  కింగ్‌డమ్ విజన్ 2030 లక్ష్యాలకు అనుగుణంగా విదేశీ సందర్శకుల సంఖ్యను పెంచే ప్రయత్నాలలో ఈ చర్యలు తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com