233 మొబైల్స్, 25 ల్యాప్‌టాప్‌ల చోరీ: నలుగురి ముఠాపై విచారణ ప్రారంభం
- December 03, 2022
యూఏఈ: దుబాయ్ ఫ్రీ జోన్లో ఉన్న ఓ షిప్పింగ్ కంపెనీ వేర్‌హౌస్ నుండి 233 మొబైల్ ఫోన్లు, 25 ల్యాప్‌టాప్‌లను దొంగిలించినందుకు ఉజ్బెకిస్థాన్‌కు చెందిన నలుగురు జాతీయులపై దుబాయ్ క్రిమినల్ కోర్టులో విచారణ ప్రారంభమైంది. దొంగిలించబడిన వస్తువులలో ఐఫోన్లు, శామ్సంగ్ గెలాక్సీ ఫోన్లు, మ్యాక్‌బుక్స్ ఉన్నాయని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. పోలీసుల కథనాల ప్రకారం.. మే 15న కంపెనీ మేనేజర్ దుబాయ్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో దొంగతనం గురించి ఫిర్యాదు చేశారు. సీఐడీ బృందాన్ని క్రైం స్థలాన్ని పరిశీలించింది. గోదాం పగులగొట్టినట్లు గుర్తించారు. మధ్యాహ్నం 2 గంటలకు గిడ్డంగి షట్టర్‌ని తెరిచేందుకు నిందితులు యత్నించినట్లు సీసీటీవీ కెమెరాల ఫుటేజీ ద్వారా గుర్తించారు. గంట తర్వాత దొంగిలించిన వస్తువులతో గోదాం నుంచి బయటకు వచ్చిన ముఠా.. ఆ వస్తువులను జీఎంసీ వాహనంలోకి ఎక్కించి అక్కడి నుంచి పరారైనట్లు స్పష్టమైంది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితులను గుర్తించి పట్టుకున్నారు. దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుల్లో ఒకరిని దుబాయ్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. అతను నేరాన్ని అంగీకరించడంతోపాటు ఇతర సభ్యుల ఆచూకీని పోలీసులకు అందించాడు. పోలీసులు వారందరినీ అరెస్ట్ చేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు తరలించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా







