5 పైసల కాయిన్ పట్టుకొచ్చి ఇస్తే… రూ.400 శాకాహార భోజనం ఫ్రీ..
- December 03, 2022
విజయవాడ: భారత్ లో ఒకప్పుడు 5 పైసల కాయిన్స్ చలామణీలో ఉండేవి. ఇప్పుడు ఆ కాయిన్స్ కనపడడమే గగనమైపోయింది. ఈ నేపథ్యంలో విజయవాడలోని ఓ రెస్టారెంటు ఓ ఆఫర్ పెట్టి, 5 పైసల కాయిన్ తీసుకొస్తే రూ.400 విలువచేసే శాకాహార భోజనం ఉచితంగా తినొచ్చని పేర్కొంది. 35 రకాల వంటకాలు రుచిచూడొచ్చని ప్రకటించింది. 5 పైసల కాయిన్స్ ఇప్పట్లో ఎవరి దగ్గర ఉంటాయని అందరూ అనుకున్నారు. అయితే, ఆ రెస్టారెంటుకు 5 పైసల కాయిన్స్ పట్టుకుని వచ్చిన వారిని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
ఆ హోటల్ కు భారీగా జనాలు వచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 5 పైసలు పట్టుకుని రాజ్ భోగ్ రెస్టారెంటు ముందుకు వచ్చిన జనాలు లోపలికి వెళ్లేందుకు ఎగబడ్డారు. ఇంత మంది భోజనం చేసేందుకు వస్తారని తాము ఊహించలేదని ఆ రెస్టారెంటు యజమాని మీడియాకు తెలిపారు.
దాదాపు 300-400 మంది కస్టమర్లు వస్తారని తాము అనుకుంటే 1,000 మంది కంటే ఎక్కువ కస్టమర్లు వచ్చారని చెప్పారు. తాము మొదట వచ్చిన 50 మందికి మాత్రమే 5 పైసలకు భోజనం అందించామని, మిగతా అందరికీ సగం ధరకే (రూ.200) ఇచ్చామని చెప్పారు. ఇప్పుడు తమ రెస్టారెంటు బాగా ఫేమస్ అయిపోయిందని సంబరపడిపోయారు. రాజస్థానీ, గుజరాతీ, ఉత్తర భారత తాలీని తాము వడ్డించామని చెప్పారు.
తాజా వార్తలు
- బిఎస్సీ అగ్రికల్చర్ ప్రశ్న పత్రం లీక్
- అనుమతి లేకుండా ఫోటోలు వాడిన మసాజ్ సెంటర్ల పై కేసు పెట్టిన ఇన్ఫ్లూయెన్సర్
- ఇరాన్ దేశవ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలు, ఇంటర్నెట్ నిలిపివేత
- తెలంగాణ: షోరూమ్‌లోనే వాహన రిజిస్ట్రేషన్
- ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపిన సీఎం రేవంత్
- TTD ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్
- మలేషియా బ్యాడ్మింటన్ టోర్నమెంట్: సెమీస్‌కు పీవీ సింధు
- అబుదాబిలో 7 మోటార్‌బైక్ ప్రమాదాలు.. 9 మందికి గాయాలు..!!
- సల్మియా మార్కెట్లో అగ్నిప్రమాదం..తప్పిన పెనుప్రమాదం..!!
- బు సిల్లా ఇంటర్‌ఛేంజ్‌పై తాత్కాలిక ట్రాఫిక్ ఆంక్షలు..!!







