అబుధాభిలో సంబరాలు

- December 03, 2022 , by Maagulf
అబుధాభిలో సంబరాలు

సుందరంగా ముస్తాబైన ఏడు దేశాలు
దేశ సంస్కృతి ఆచార సంప్రదాయాలు 
గౌరవిస్తు దేశీయులు విదేశీయులు 
ప్రవాసులు మైత్రీసుహృధ్భావనతో
మనసుల్లోఈ దేశంపట్ల ఉప్పొంగే గౌరవము 
భిన్నసంస్కృతుల  సమాహారము 
సమైక్యత ఐకమత్యంతో చేతులెత్తి
చేసేరు జనులంతా వందనాలు .....


కర్మభూమిలో వెల్లివిరిసే  ఆనందసరాగాలు 
పిల్లల పెద్దల మదిలో ఉప్పొంగే సంతోషాలు
హంగులతో స్వతంత్ర భావాలతో ఠీవీగా 
వినువీధుల్లోరెపరెపలాడే త్రివర్ణ పతాకం 
మిరుమిట్లు కొలిపే దీపకాంత శిఖాలు
మిన్నంటే అంబరాల  సంబరాలు 

ఆకాశాన రయ్ రయ్ మనే విన్యాసాలు 
కుర్రకారుజోరు హుషారైన షికారులు 
అరబ్బీయుల ముచ్చటైన వేషధారణలు 
అడుగడుగున వినిపించే దేశీయ గీతాలు 

హింస చొరనీయని అహింసే చిరునామాగ 
శాంతిభద్రతలు  ఆరోగ్యము పర్యావరణ 
పరిరక్షణతో విశ్వంలో అత్యున్నత సురక్షిత 
దేేశంగా సుభిక్షపాలనతో యాభైవసంతాలు
పూర్తిచేసుకొని యాభైఒకటో వత్సరంలోకి
అడుగిడిగి *జాతీయదినం* వేడుకలు
చేసుకుంటున్న అరబ్బీయుల గల్ఫ్ దేశము.......

(యామిని కోళ్ళూరు,అబుధాభి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com