పద్మ భూషణ్ పురస్కారాన్ని అందుకున్న గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్
- December 03, 2022
న్యూఢిల్లీ: భారతదేశం తన శరీరంలో అంతర్భాగమని గూగుల్ సీఈవో, భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తన వెంట భారతదేశాన్ని తీసుకెళతానని వ్యాఖ్యానించారు. భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మ భూషణ్ పురస్కారాన్ని అందుకుంటూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2022 ఏడాదికిగానూ సుందర్ పిచాయ్ కి పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించగా.. అమెరికాలోని భారత రాయబారి నుంచి సుందర్ పిచాయ్ శుక్రవారం ఈ పురస్కారం అందుకున్నారు.
శాన్ ఫ్రాన్సిస్కో లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఆయన ఈ పురస్కారం అందుకున్నారు. అమెరికాలో భారత రాయబారి తరణ్ జిత్ సింగ్ సంధు ఈ అవార్డును సుందర్ పిచాయ్ కి అందజేశారు. భారత దేశంలో మూడో అత్యున్నత పురస్కారం పద్మ భూషణ్ ను తనకు అందించడంపై సుందర్ పిచాయ్ భారత ప్రభుత్వానికి, దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తన తల్లిదండ్రులను, తన ఎదుగుదలకు సహాయపడిన వారిని ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సుల్ జనరల్ టీవీ నాగేంద్ర ప్రసాద్ కూడా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!







