మాస్ రాజా అలా సెట్టయిపోతే పోలా.?

- December 03, 2022 , by Maagulf
మాస్ రాజా అలా సెట్టయిపోతే పోలా.?

మాస్ రాజా రవితేజకు ప్రస్తుతం కాలం కలిసి రావడం లేదు. ఏది పట్టినా మట్టయిపోతోంది. మరోవైపు దారుణంగా నెగిటివిటీ. నిర్మాతలను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు తాగించేస్తున్నాడంటూ దుష్ప్రచారం. 

అన్నీ వెరసి, చేతి నిండా సినిమాలున్నాయ్. ఏ ఒక్క దాని మీదా అంచనాల్లేవ్. ఈ తరుణంలో కొన్ని గెస్ట్ రోల్స్‌పై మన మాసోడు దృష్టి పెట్టాడు. అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవితో ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాలో నటిస్తున్నాడు. త్వరలో ‘ధమాకా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు రవితేజ. 

ఇదిలా వుంటే, కొత్తగా నిర్మాత అవతారం కూడా ఎత్తాడు రవితేజ. అది కూడా ఓ తమిళ సినిమాకి. తమిళ యంగ్ హీరో విష్ణు విశాల్ లీడ్ రోల్‌లో వచ్చిన ‘మట్టి కుస్తీ’కి రవితేజ నిర్మాత భాగస్వామ్యం వహించాడు. 

తెలుగులో ఈ సినిమాని రిలీజ్ చేసింది రవితేజనే. తమిళ సినిమానే అయినా ప్రమోషన్లు గట్టిగా చేశారు. రివ్యూలు కూడా బాగా వచ్చాయ్. ఓ మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ.. అంటూ పాజటివ్ వైబ్స్‌తో రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీంతో, హీరోగా సినిమాలు చెయ్యొద్దు.. ఇలా నిర్మాతగా సరిపెట్టేసుకో ప్లీజ్ అంటూ రవితేజకు అభిమానులే ఉచిత సలహాలిచ్చేస్తున్నారట. నిజంగా మాస్ రాజాకి ఇది చాలా దుర్భరమైన పరిస్థితే కదా.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com