విష్ణు, రాజ్‌తరుణ్‌తో 'గుండమ్మ కథ' రీమేక్‌...!

- April 24, 2016 , by Maagulf
విష్ణు, రాజ్‌తరుణ్‌తో 'గుండమ్మ కథ' రీమేక్‌...!

''గుం డమ్మ కథ' హక్కులు ఎవరిదగ్గరైనా ఉంటే కొని విష్ణు, రాజ్‌తరుణ్‌తో రీమేక్‌ చేయాలని ఉంద''న్నారు ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్‌బాబు. 'ఈడోరకం ఆడోరకం' విజయోత్సవ సభకు ఆయన అతిథిగా హాజరయ్యారు. మంచు విష్ణు, రాజ్‌ తరుణ్‌ కథానాయకులుగా నటించిన చిత్రం 'ఈడోరకం ఆడోరకం'. జి.నాగేశ్వరరెడ్డి దర్శకుడు. మోహన్‌బాబు మాట్లాడుతూ ''విష్ణు, రాజ్‌తరుణ్‌ ఈ చిత్రంలో చక్కగా నటించారు. జి.నాగేశ్వరెడ్డి బాగా తీర్చిదిద్దారు. అందుకే 'గుండమ్మ కథ' తెరకెక్కిస్తే ఆయన చేతిలోనే పెడతాన''న్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన దాసరి నారాయణరావు మాట్లాడుతూ ''కథానాయకుల్ని కాదు, కథను నమ్మి సినిమాలు చేయాలి. అప్పుడే విజయాలు దక్కుతాయి. ఒకట్రెండు విజయాలు రాగానే పారితోషికం పెంచి నిర్మాతల్ని ఇబ్బంది పెట్టకూడదు. ఈ విషయం ఈతరం కథానాయకులందరినీ కూర్చోబెట్టి చెప్పాలని ఉంద''న్నారు. ''వినోదాత్మక చిత్రాలకు విజయం తథ్యం. నవ్వించే సినిమాలు తక్కువైపోయాయి. అలాంటి చిత్రాలొస్తే తప్పకుండా ఆదరిస్తారు. ఆ నమ్మకంతో చేసిన ప్రయత్నమిద''న్నారు జి.నాగేశ్వరరెడ్డి. ఈ విజయం అమ్మానాన్నలకు అంకితం ఇస్తున్నట్టు తెలిపారు విష్ణు. రాజేంద్రప్రసాద్‌తో కలసి నటించడం మర్చిపోలేని అనుభవమని రాజ్‌ తరుణ్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత అనిల్‌ సుంకర, రాజేంద్ర ప్రసాద్‌, పోసాని, హెబ్బాపటేల్‌, సాయికార్తీక్‌ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com