రైతు రుణమాఫీ కోసం రెండో విడతలో భాగంగా రూ.3,250 కోట్లు విడుదల..

- April 24, 2016 , by Maagulf
రైతు రుణమాఫీ కోసం రెండో విడతలో భాగంగా రూ.3,250 కోట్లు విడుదల..

రెండో విడత రుణమాఫీ ఫైలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సంతకం చేశారు. గుంటూరు జిల్లాలోని వెలగపూడిలో ఈ రోజు ఉదయం ఏపీ తాత్కాలిక సచివాలయాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతు రుణమాఫీ కోసం రెండో విడతలో భాగంగా రూ.3,250 కోట్లు విడుదల చేస్తూ ఫైల్‌పై చంద్రబాబు సంతకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... రైతు రుణమాఫీపై ఈరోజు సంతకం చేశాన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు పాదాభివందనం చేస్తానని సీఎం చెప్పారు. రైతులు తనపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారని, వాళ్ల నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని సీఎం అన్నారు. రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, అలాంటి వాళ్లకు ప్రజలే బుద్ధి చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com