సౌదీ అరేబియాలో మొదటి లగ్జరీ ద్వీపం సిందాలాహ్
- December 07, 2022
సౌదీ అరేబియా: నియోమ్ (NEOM) కొత్త ద్వీపం సిందాలాహ్ అభివృద్ధి ప్రాజెక్ట్ వివరాలను సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ వెల్లడించారు. ఇది సౌదీ అరేబియా పర్యాటక రంగం వృద్ధికి దోహదం చేస్తుందన్నారు. NEOMలో అభివృద్ధి చేయబడే ద్వీపాల సమూహంలో ఒకటైన సిందాలాహ్.. 840,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న మొదటి విలాసవంతమైన ద్వీపంగా నిలవనున్నది. ఎర్ర సముద్రానికి ప్రధాన గేట్‌వేగా ఇది మారనుంది. సిందాలాహ్ ద్వీపం 2024 ప్రారంభంలో సందర్శకులకు అందుబాటులోకి రానున్నది. ఈ ప్రాజెక్ట్ పర్యాటక రంగం, ఆతిథ్య రంగాలలో కొత్తగా 3,500 ఉద్యోగాలను సృష్టించేందుకు సహాయపడుతుందని సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ వెల్లడించారు.
సిందాలాహ్ ద్వీపంలో అంతర్జాతీయ యాచింగ్ అనుభవాన్ని అందించనున్నది. ఇక్కడ ప్రతిష్టాత్మకమైన 86-బెర్త్ మెరీనాను ఏర్పాటు చేయనున్నారు. ఇది విలాసవంతమైన నౌకలకు అనువైన గమ్యస్థానంగా మారుతుంది. ఇది 413 అల్ట్రా-ప్రీమియం హోటల్ గదుల నుండి 333 టాప్-ఎండ్ సర్వీస్డ్ అపార్ట్‌మెంట్‌ల వరకు వివిధ వసతి ఎంపికలను కూడా అతిథులకు అందుబాటులో ఉంటాయి.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







