సుప్రీంకోర్టు మొబైల్ యాప్ 2.0 ప్రారంభం
- December 08, 2022
న్యూఢిల్లీ: భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటోంది. ఈ క్రమంలో మొబైల్ యాప్ 2.0ని ప్రారంభించినట్లు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ప్రకటించారు. న్యాయ అధికారులు, ప్రభుత్వ విభాగాలు తమ కేసులను ట్రాక్ చేయడానికి ఇది వీలు కల్పిస్తుందని ఆయన చెప్పారు. ఈ కొత్త వెర్షన్ యాప్ తో ప్రభుత్వ శాఖలు తమ పెండింగ్ కేసులను చూడవచ్చని ఆయన తెలిపారు. గూగుల్ ప్లే స్టోర్ లో యాప్ 2.0 అందుబాటులోకి వస్తుందని అన్నారు. ఇక ఐఓఎస్ వినియోగదారుల కోసం వారం రోజుల్లో యాప్ అందుబాటులోకి వస్తుందని చంద్రచూడ్ ప్రకటించారు.
అదనపు ఫీచర్లతో యాప్ ను తయారు చేసినట్లు ఆయన వెల్లడించారు. దీన్ని ఉపయోగించి న్యాయాధికారులు, వివిధ కేంద్రమంత్రిత్వ శాఖలకు చెందిన నోడల్ ఆఫీసర్లు తమ కేసులను ట్రాక్ చేసుకునేందుకు వీలు ఉంటుందన్నారు. నోడల్ అధికారులు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కేసులు, స్టేటస్ ఆర్డర్ లు, తీర్పులు, దాఖలు చేసిన ఏవైనా ఇతర పత్రాలను.. యాప్ లోకి వెళ్లి పరిశీలించవచ్చని తెలిపారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







