‘శాకుంతలం’కీ ‘రుద్రమదేవి’లా ‘ఆ’ కష్టాలు తప్పడం లేదా.?
- December 10, 2022
సమంత ప్రధాన పాత్రలో రూపొందుతోన్న పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’. ఈ ఏడాది చివరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందనుకున్నారంతా. కానీ, వచ్చేలా కనిపించడం లేదు.
ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ‘శాకుంతలం’, టెక్నికల్ వర్క్ కోసం ఇప్పటికే ఏడాదికి పైగా టైమ్ తీసుకున్నారు. ఆ టైమ్ ఇంకా సరిపోలేదని తెలుస్తోంది. ఈ ఏడాది ‘శాకుంతలం’ రిలీజ్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
అంతేకాదు, ఈ సినిమాకి ఆర్ధిక కష్టాలు కూడా బాగా వెంటాడుతున్నట్లు ఇన్‌సైడ్ సోర్సెస్ సమాచారం. గతంలో ‘రుద్రమదేవి’ సినిమాకీ బడ్జెట్ విషయంలో ఇలాగే జరిగింది. ఇక చివరికి బడ్జెట్ తాళలేక, ఆలస్యం తట్టుకోలేక డైరెక్టర్ గుణశేఖర్ ఎలాగోలా సినిమాని పూర్తి చేసి వదిలేశారు.
దాంతో క్వాలిటీ లేని గ్రాఫిక్స్.. హిస్టరీకి అవమానం జరిగిందంటూ దారుణంగా విమర్శలొచ్చాయ్. ఇప్పుడు ‘శాకుంతలం’ విషయంలోనూ అదే జరగబోతోందా.? ఈ ఆర్ధిక భారాన్ని డైరెక్టర్ గుణ శేఖర్ ఈ సారైనా కరెక్ట్‌గా డీల్ చేస్తాడా.? లేదా.? చూడాలి మరి.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







