బిగ్‌బాస్.! కప్పు కోసం బరిలో నిలిచేది వారిద్దరేనా.?
- December 10, 2022
బిగ్‌బాస్ ఆరో సీజన్‌కి సంబంధించి మొదట్నుంచీ సింగర్ రేవంత్ టాప్‌లో వుంటూ వస్తున్నాడు. అత్యధిక రెమ్యునరేషన్ ఈ సీజన్లో రేవంతే దక్కించుకుంటున్నాడని టాక్ కూడా వుంది.
ఇక, ఈ సీజన్ విన్నర్ కూడా రేవంత్ అనే ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే, షోలో రేవంత్ పట్ల నెగిటివిటీ ఏర్పడుతూ వచ్చింది. దాంతో, ప్రేక్షకుల అభిప్రాయాలు మధ్యలో మారుతూ వచ్చినప్పటికీ క్లైమాక్స్‌కి చేరే సరికి మళ్లీ రేవంత్ పేరే వినిపిస్తోంది.
బిగ్‌బాస్ మరో రెండు వారాలు మాత్రమే మిగిలి వుంది. ప్రస్తుతం ఏడుగురు కంటెస్టెంట్లు హౌస్‌లో వున్నారు. అందులో ముగ్గురు లేడీస్, నలుగురు జెంట్స్. ఈ ఏడుగురిలో ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ద్వారా ఇద్దరిని బయటికి పంపించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ఆల్రెడీ శ్రీహాన్ ఫైనలిస్ట్ లిస్టులో చేరిపోయాడు. అన్ అఫీషియల్ ఓటింగ్ లిస్టులో రేవంత్ ఎప్పటిలాగే టాప్‌లో కొనసాగుతున్నాడు. ఇక మిగిలిన వారిలో ఇనయ, ఆది రెడ్డి న్యూట్రల్‌గా వుండగా, కీర్తి, రోహిత్, శ్రీసత్యలు డేంజర్ జోన్లో వున్నట్లు తెలుస్తోంది.
సో ఈ ముగ్గురిలో ఇద్దరు బయటికి వెళతారా.? లేదా.? ఒక్కరే వెళతారా.? అనేది తెలియాల్సి వుంది. ఇక కప్పు కోసం ఫైనల్‌గా పోరాడేది శ్రీ హాన్, రేవంత్ అని ప్రేక్షకులు ఓ ఐడియాకి వచ్చేశారు. చూడాలి మరి, ఈ ఇద్దరు స్నేహితుల్లో కప్పు గెలిచేది ఎవరో.!
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







