‘మాచర్ల’.! ఎందుకు నచ్చలేదబ్బా.!
- December 10, 2022
నితిన్, కృతిశెట్టి జంటగా తెరకెక్కిన ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా మొన్నా మధ్యన ధియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఫస్ట్ డే ఫస్ట్ షోకే జనం పెదవి విరిచేశారీ సినిమాకి. రిలీజ్‌కి ముందు డైరెక్టర్ చేసిన ఓవరాక్షన్ కూడా ఈ సినిమా ఫెయిల్యూర్‌కి ఓ కారణంగా చెబుతారు.
దాంతో, సరైన ఓపెనింగ్స్ కూడా లేకుండా అడ్రస్ గల్లంతైపోయింది. మౌత్ టాక్‌తోనే సినిమాలు ఆడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అలా ‘మాచర్ల నియోజక వర్గం’ రేస్‌లోంచి పక్కకు తప్పుకుపోయింది.
సర్లే, ఓటీటీలో అయినా చూసి పడేద్దాంలే అనుకుంటే, విడుదలై ఇన్నాళ్లయినా ఈ సినిమా ఓటీటీ ప్రదర్శనకు నోచుకోలేదెందుకో.! ఎట్టకేలకు తాజాగా ఓటీటీలో రిలీజైన ఈ సినిమా హోమ్ ధియేటర్లలో బాగానే ఆదరణ దక్కించుకుంటోంది.
ఎంటర్‌టైన్‌మెంట్ ప్లస్ యాక్షన్.. ఓకే అంటున్నారు ఓటీటీ ఆడియన్స్. మరీ అడ్రస్ గల్లంతయ్యేంత చెత్తలా ఏమీ లేదనేది ఓటీటీ ఆడియన్స్ అభిప్రాయం. ఎంటర్‌టైన్‌మెంట్ రీజన్ ఓ ఎత్తు.. లాంగ్ వీకెండ్ కావడం ఇంకో ఎత్తు.. సర్లే..! అని రెండో సారి కూడా వీక్షించేస్తున్నారట. అలా ధియేటర్లో ఫెయిలైనా ఓటీటీ ధియేటర్లో ‘మాచర్ల’ ఒకింత సెక్సెస్ అయినట్లే.!
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







