హిమాచల్ ప్రదేశ్ సీఎంగా సుఖ్విందర్ సింగ్ సుఖు ప్రమాణ స్వీకారం..
- December 11, 2022
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర 15వ ముఖ్యమంత్రిగా సుఖ్విందర్ సింగ్ సుఖు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా ముఖేష్ అగ్నిహోత్రి ప్రమాణ స్వీకారం చేశారు. మధ్యాహ్నం 1.30 గంటలకు సిమ్లాలోని రిడ్జ్ మైదానంలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. వీరితో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణం చేయించారు.
ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో పాటు కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలు, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ హుడా, హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ఇన్ ఛార్జి రాజీవ్ శుక్లా పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు ఇంటి నుంచి బయలుదేరే క్రమంలో సుఖ్విందర్ అతని తల్లి పాదాలకు నమస్కారం చేశారు.
తాజా వార్తలు
- కువైట్లో ‘వికసిత్ భారత్ 2047: ఇండియా-కువైట్ డైలాగ్స్’ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ముగిసిన ప్రపంచ పారా బ్యాడ్మింటన్..!!
- విజిట్ వీసా గడువు ముగిసిన వారి గురించి చెప్పకపోతే..జైలు శిక్, SR50,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ లక్కీ డే డ్రా..Dh5 మిలియన్లు గెలిచిన విజేత..!!
- ప్రైవేట్ రంగానికి కొత్త వర్కింగ్ అవర్స్..ప్రకటించిన ఖతార్..!!
- ఒమన్ లో రవిశంకర్ సెలబ్రేట్ లైఫ్ ఇంటరాక్షన్ సక్సెస్..!!
- ఏఐ ప్రభావం షాకింగ్, ఉద్యోగాలకు భారీ ముప్పు?
- Bangladesh: తారిక్ రెహమాన్ ప్రధాని కావడం భారత్కు ప్రయోజనమా?
- బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రముఖ రియల్టీ సంస్థ అన్విత గ్రూప్
- ఏపీ బడ్జెట్ 2026-27: దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం









