చీజ్ ఆమ్లెట్
- April 25, 2016
కావలసినవి: కోడిగుడ్లు- రెండు, తురిమిన చీజ్- 50 నుంచి 100 గ్రాములు, ఆలివ్ ఆయిల్- ఒక టేబుల్ స్పూన్, పెప్పర్- పైన చల్లడానికి.
ఎలా చేయాలి
కోడిగుడ్లను పగులగొట్టి పచ్చసొనను ఒక బౌల్‌లో, తెల్లసొనను ఒక బౌల్‌లో వేరు చేసి ఉంచుకోవాలి. ముందుగా తెల్లసొనను రెండు నిముషాలు బాగా కలిపి, ఆ తరువాత పచ్చసొనను మిక్స్ చేయాలి. చీజ్ ఆమ్లెట్ వేయడానికి ఇది చాలా ముఖ్యమైనది. నాన్‌స్టిక్ పాన్‌ను తీసుకుని అందులో ఆయిల్ వే సి వేడిచేసి కోడిగుడ్ల సొనలను వేయాలి. వేగాక రెండవ వైపు తిప్పాలి. రెండవ వైపు తిప్పిన తరువాత దానిపైన తురిమి ఉంచుకున్న చీజ్‌ను వేయాలి. చీజ్‌ను ఎక్కువభాగం మధ్యలోనే ఉండేట్లు చూసుకుని ముప్ఫై సెకన్లు అలాగే ఉంచి దోశెను మడత వేసినట్లు మడత వేయాలి. దీనిపైన పెప్పర్ చల్లి టమోటో కచెప్‌తో వేడిగా వడ్డించాలి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







