ప్రేమకథా చిత్రాల దర్శకుడితో శర్వానంద్..
- April 25, 2016
ప్రేమకథా చిత్రాల దర్శకుడిగా మంచి ఇమేజ్ తెచ్చుకున్న కరుణాకరన్‌కు ఈమధ్య సరైన హిట్స్ లేవు. చేసిన సినిమాలు బాక్స్ఆఫీసువద్ద బోల్తా కొడుతుండడంతో కెరీర్ డీలాపడింది. ప్రేమకథలను బాగా డీల్ చేయగల ఈ దర్శకుడు ఈసారి హ్యాట్రిక్ హీరోను పట్టేసాడు. అతడెవరో కాదు శర్వానంద్. ఇప్పటికే వీరిద్దరి మధ్య చర్చలు కూడా కొలిక్కి వచ్చాయని, కథతోపాటు స్క్రిప్ట్ కూడా ఓకే అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి రానుందట. మరోవైపు శర్వానంద్ 'కుమారి 21ఎఫ్' దర్శకుడు సూర్యప్రతాప్తో కూడా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ఆ సినిమా స్క్రిప్ట్ కూడా రెడీ అవుతోంది. కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందే సినిమాను బోగవల్లి ప్రసాద్ నిర్మిస్తాడని అంటున్నారు. మరి శర్వానంద్ కోసం కరుణాకరన్ ఎలాంటి ప్రేమకథ చెబుతాడో చూడాలి!
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







