ఈనెల 29న మధ్యాహ్నం 1:30 లకు చిరంజీవి చిత్ర ప్రారంభోత్సవం ..
- April 25, 2016
మెగా అభిమానులకో శుభవార్త. ఎప్పెడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిరంజీవి 150వ సినిమా కు ఎట్టకేలకు ముహుర్తం కుదిరింది. ఈనెల 29న మధ్యాహ్నం 1:30 లకు ఈ చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరగనుంది. ఆ తర్వాత మంచి ముహూర్తాలు లేకపోవడంతో ఆ రోజు దేవుడి పటాలపై పూజతో లాంఛనంగా ప్రారంభించనున్నారు. వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం ముహుర్తం షాట్ కు కుటుంబ సభ్యులకు మాత్రమే ఎంట్రీ ఉన్నట్లు సినీవర్గాల సమాచారం. పవన్ స్టార్ పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ తో పాటు కొద్దిమంది కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కానున్నట్టు తెలిసింది.తన 150 వ చిత్రానికి మంచి కథ కోసం చూస్తున్న చిరుకి... తమిళంలో విజయ్ హీరోగా నటించిన 'కత్తి' సినిమా కథ నచ్చడం రీమేక్ రైట్స్ సొంతం చేసుకోవడం జరిగింది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్న ఈ చిత్రానికి దర్శకుడు ఎవరా అని చర్చలు జరిగి, పలుపేర్లు తెరమీదకు వచ్చినా, చివరకు ఆ అవకాశం వీవీ వినాయక్ కే దక్కింది. గతంలో చిరంజీవి, వివి వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన ఠాగూర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా, చిరంజీవి 150వ చిత్రానికి తనయుడు రాంచరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!







