సిరియాలో అమెరికా డ్రోన్ దాడిలో మృతి..
- April 25, 2016
ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ఉగ్రవాద సంస్థ భారత విభాగం చీఫ్ మహమ్మద్ షఫీ అర్మార్ అలియాస్ యూసుఫ్ ఇటీవల సిరియాలో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో హతమైనట్లు తెలుస్తోంది. 'అతడు మృతి చెందినట్లు తెలిసింది.ఐసిస్ ప్రాబల్యమున్న సిరియా నుంచి సమాచారం రావడానికి కొంత సమయం పట్టొచ్చు' అని భారత ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఐసిస్ అధినేత అబూ బకర్ అల్ బాగ్దాదీకి ముఖ్య సన్నిహితుడైన షఫీ(26) భారత్‌లో ఐసిస్ విభాగాన్ని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసేందుకు సహకరిస్తున్నాడు. అతడు 30 మందిని ఈ ఉగ్రవాద సంస్థలో చేర్పించినట్లు సమాచారం.భారత్‌లో ప్రతి రాష్ట్రంలో ఐసిస్ శాఖ ఏర్పాటుకు అతడు ప్రణాళిక వేశాడని భారత్‌లో అరెస్టయిన ఐసిస్ ఉగ్రవాదులు విచారణలో వెల్లడించినట్లు అధికారులు చెప్పారు. షఫీ ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా వేదికల్లో దాదాపు 700 మంది భారతీయ యువకులతో సంబంధాలు నెరుపుతున్నట్లు నిఘా అధికారులు చెప్పారు. కర్ణాటకలోని భక్తల్‌కు చెందిన షఫీ అన్న సుల్తాన్ అర్మార్ కూడా గత ఏడాది వరకు ఐసిస్ భారత విభాగానికి నాయకత్వం వహించాడు. 2015 మార్చిలో అమెరికా ద్రోన్ దాడిలో హత మయ్యాడు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







