జాక్వెలీన్ తీగ లాగితే, నోరా ఫతేహి డొంక కదలడమేంటీ చెప్మా.!
- December 13, 2022
శ్రీలంక బ్యూటీ జాక్వెలీన్ ఫెర్నాండెజ్ పేరు హీరోయిన్‌గానే కాకుండా ఈ మధ్య మరోరకంగానూ ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. మనీ ల్యాండరింగ్ కేసు నిమిత్తం జాక్వెలీన్ పేరు తెగ మార్మోగిపోయింది.
సుశేష్ చంద్రశేఖర్‌కి బినామీగా 200 కోట్ల మనీ ల్యాండరింగ్ కేసులో జాక్వెలీన్కీ ఓ హస్తం వున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ కేసు నిమిత్తం జాక్వెలీన్పై ఈడీ చేసిన ప్రత్యేక విచారణలో భాగంగా ఆమె మరికొంతమంది సినీ ప్రముఖుల పేర్లను ఈడీ అధికారులకు ముందుంచింది.
ఆ క్రమంలో ఐటెం గాళ్ నోరా ఫతేహి పేరును జాక్వెలీన్ ప్రస్థావించింది. దాంతో, మండి పడ్డ నోరా ఫతేహి, జాక్వెలీన్పై పరువు నష్టం దావా వేసింది.
తన సక్సెస్‌ని ఓర్వలేకే జాక్వెలీన్ ఇలా చేసిందనీ, తనకూ, ఆ కేసుకూ ఎలాంటి సంబంధం లేదని నోరా ఫతేహి గగ్గోలు పెడుతోంది. కావాలనే నన్ను ఈ కేసులో ఇరికించిందంటూ జాక్వెలీన్పై రివర్స్ అయ్యింది నోరా ఫతేహి. జాక్వెలీన్ ఇచ్చిన ఆధారాలతో నోరా ఫతేహిని ఈడీ అధికారులు విచారణ చేయాల్సి వచ్చింది. ఈ కేసును ఈ నెల 19కి వాయిదా వేశారు.
తాజా వార్తలు
- 'రాయల్' ఫోటోగ్రాఫర్ రమేష్ శుక్లాకు షేక్ హమ్దాన్ నివాళి..!!
- ఒమన్ లో పోలీసుల అధికారిక వర్కింగ్ అవర్స్ ఇవే..!!
- సౌదీలో డొమెక్టిక్ వర్కర్స్ తొలగింపునకు అనుమతి..!!
- బహ్రెయిన్ వార్షిక ఫైన్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- ఖతార్ లో ఆహార సంస్థల పై నిఘా ముమ్మరం..!!
- రమదాన్..మస్జీదులలో కె-నెట్ పరికరాలపై నిషేధం..!!
- అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కీలక పొలిటికల్ హామీ
- SBI ఇన్సూరెన్స్ స్కీం: ₹3,000 ప్రీమియంతో ₹60 లక్షల ప్రమాద బీమా
- JEE మెయిన్ 2026 ఫైనల్ కీ విడుదల
- వాణిజ్య ఒప్పందాలతో కొత్త ఆర్థిక యుగం









