బహ్రెయిన్ వార్షిక ఫైన్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- February 16, 2026
మనమా: బహ్రెయిన్ నేషనల్ మ్యూజియంలో 52వ ఎడిషన్ బహ్రెయిన్ వార్షిక ఫైన్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్‌ను హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా తరపున, క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ప్రారంభించారు. బహ్రెయిన్ సృజనాత్మక వారసత్వాన్ని మరియు ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా ఇలాంటి ఎగ్జిబిషన్లు తెలియజేస్తాయని పేర్కొన్నారు.
మల్టీమీడియా ఇన్స్టాలేషన్లు, వీడియో ఆర్ట్, ఫోటోగ్రఫీ, ఆర్ట్ మరియు సమకాలీన డ్రాయింగ్‌తో సహా విభిన్న టాలెంట్ ఉన్న దాదాపు 74 మంది కళాకారుల అద్భుత సృష్టిని ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేశారు. వీటిని సందర్శించిన హిస్ హైనెస్, కళాకారులు చేసిన కృషిని అభినందించారు. సృజనాత్మకత మరియు ఆవిష్కరణలకు కేంద్రంగా బహ్రెయిన్ స్థాయిని పెంచిన బహ్రెయిన్ అథారిటీ ఫర్ కల్చర్ అండ్ యాంటిక్విటీస్ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ అహ్మద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫాను ఈ సందర్భంగా అభినందించారు. చివరగా అత్యుత్తమ కళాకారులకు అవార్డులను ప్రదానం చేశారు.
అల్-దానా అవార్డును అబ్దుల్ జబ్బర్ అల్-గధబాన్, అల్ రివాక్ ఆర్ట్ స్పేస్ “నెక్సస్ ప్రోగ్రామ్” అవార్డును ఖలీద్ వలీద్ అల్-అబ్బాస్, RAK ఆర్ట్ ఫౌండేషన్ అవార్డును హుస్సేన్ అలీ ఇసాకు అందజేశారు. 1972 లో స్థాపించిన బహ్రెయిన్ వార్షిక ఫైన్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ రాజ్యంలో ఒక ప్రధాన సాంస్కృతిక వేదికగా గుర్తింపు పొందింది.
తాజా వార్తలు
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- Four astronauts reach International Space Station in record time
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం







