స్కూల్‌ బస్‌ స్టాప్‌ ఆర్మ్స్‌ - కెమెరా

- April 26, 2016 , by Maagulf
స్కూల్‌ బస్‌ స్టాప్‌ ఆర్మ్స్‌ - కెమెరా



స్కూలు బస్సులోకి విద్యార్థులు ఎక్కుతున్నప్పుడు, దిగుతున్నప్పుడు వాటిని ఓవర్‌టేక్‌ చేయడం ఇకపై నేరం. రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ (ఆర్‌టిఎ) ఈ మేరకు స్టాప్‌ ఆర్మ్స్‌పై కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా నిబంధనల్ని ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతోంది. విద్యార్థులు బస్సు ఎక్కుతున్నప్పుడు లేదా, దిగుతున్నప్పుడు ఈ స్టాప్‌ ఆర్మ్‌ బస్సుకి ఎడమవైపు కనిపిస్తుంది. వెంటనే, వెనకాల వచ్చే వాహనాలు ఆగవలసి ఉంటుంది. ఇది విద్యార్థుల భద్రత కోసం ఏర్పాటు చేయబడిన నిబంధన అయినప్పటికీ, చాలామంది వాహనదారులు ఈ నిబంధనను పట్టించుకోవడంలేదు. విద్యార్థుల భద్రత కోసం తీసుకునే చర్య ఇలా ఉండగా, స్కూల్‌ బస్‌ ఫీ స్ట్రక్చర్‌ని రెగ్యులేట్‌ చేయడంపైనా నాలెడ్జ్‌ హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీతో కలిసి ఆర్‌టిఏ సమాలోచనలు చేస్తోంది. స్కూలు బస్సుల విషయానికి వస్తే జిపిఎస్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌, 3 ప్లస్‌ 2 సిసిటివి కెమెరాల ఏర్పాటును తప్పనిసరి చేసింది. 12 సీట్లు కలిగిన మినీ వ్యాన్లను స్కూలు బస్సులుగా ఉపయోగించకుండా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com