సీసీటీవీలో పనిమనిషి చేసిన చేష్టలు చూసి ఆశ్చర్యపోయిన యజమాని
- April 26, 2016
ఎంతో నమ్మకంగా ఇంట్లో పని చేయాల్సిన ఓ మహిళ చేయకూడని తప్పుచేసి అడ్డంగా దొరికిపోయింది. సీసీ టీవీలో అసలు విషయాన్ని గమనించిన యజమాని షాక్ నుంచి తేరుకోలేకపోయాడు. అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ వివరాలిలా ఉన్నాయి.. కువైట్ లో ఓ ఇంట్లో ఇద్దరు మహిళలు హౌస్ మెయిడ్స్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇంటి యజమాని తనకు జ్యూస్ కావాలని అడిగాడు. ఇంతలో ఓ మహిళ జ్యూస్ తయారు చేసి ఏదో పనిమీద కాస్త పక్కకువెళ్లింది.అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. మరో మహిళ యజమాని కోసం సిద్ధం చేసిన జ్యూస్ లో తన యూరిన్ ను పోసింది. ఈ దృశ్యాలు వంటింట్లో ఏర్పాటుచేసిన సీసీటీవీలో స్పష్టంగా రికార్డయ్యాయి. ఆ వీడియోను గమనిస్తే ఆ మహిళ ఆ పనికి ముందే సిద్ధమైనట్లు కనిపిస్తోంది. అయితే ఆ పుటేజ్ ఎలాగో బయటకు లీక్ అయింది. ఈ విషయం ఆనోటా ఈనోటా మీడియాకు చేరింది.
మీడియా ఆ కుటుంబాన్ని సంప్రదించగా, కెమెరాలో ఆ దృశ్యాన్ని చూసి షాక్ తిన్నానని యజమాని చెప్పాడు. కానీ, ఆ ఘాతుకానికి పాల్పడ్డ పనిమనిషి పేరు, వివరాలు వెల్లడించేందుకు ఇంటి యజమాని నిరాకరించాడు. అయితే చుట్టుపక్కల ఇళ్లవారిని మాత్రం పనివారి చేష్టలపై కన్నేసి నిఘా పెట్టాలని సూచన చేయటం విశేషం.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







