మే 2న 'అ.. ఆ' ఆడియో వేడుక

- April 26, 2016 , by Maagulf
మే 2న 'అ.. ఆ' ఆడియో వేడుక

నితిన్‌, సమంత జంటగా నటించిన 'అ..ఆ' చిత్రం ఆడియో విడుదల వేడుకను మే 2న శిల్పకళా వేదికలో నిర్వహించనున్నారు. చిత్ర బృందం తమ ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ... సినిమా స్టిల్‌ను అభిమానులతో పంచుకుంది. ఇటీవల ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్‌ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. త్వరలో 'అ..ఆ' ప్రేక్షకుల ముందుకు రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com