'18 పేజెస్' థియేట్రికల్ ట్రైలర్ విడుదల
- December 17, 2022
హైదరాబాద్: 18 పేజెస్ నుండి థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. కార్తికేయ 2 తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నిఖిల్ , అనుపమ లు మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు 18 పేజెస్ మూవీ తో ఈ నెల 23 న రాబోతున్నారు. కుమారి 21 ఎఫ్ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథ – స్క్రీన్ ప్లే అందించడం విశేషం. ఎప్పుడు షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ చిత్రం కరోనా కారణంగా బ్రేక్ పడుతూ వస్తూ ఎట్టకేలకు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కావోస్తుండడం తో ప్రమోషన్స్ ను స్పీడ్ చేసారు. ఈ క్రమంలో శనివారం థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేసారు.
ట్రైలర్‌లో ‘ప్రేమించడానికి రీజన్ ఉండకూడదు. అలానే ఎందుకు ప్రేమిస్తున్నాం అంటే చెప్పడానికి ఆన్సర్ ఉండకూడదు’ అని అనుపమ చెప్పిన డైలాగ్‌తో ఈ మూవీలో అన్‌కండీషనల్ లవ్‌ని చూపించబోతున్నట్లు అర్థమవుతోంది. తెలుగు యూట్యూబర్ సరయు ఈ మూవీలో నిఖిల్‌కి స్నేహితురాలిగా నటించింది. ఇద్దరి మధ్య పంచ్‌లు కూడా చాలా బాగా పేలాయి. అలానే సినిమాలో ట్విస్ట్‌లు మీద ట్విస్ట్‌లు ఉన్నాయి. లవ్ స్టోరీ నుంచి డైరీ.. ఆ తర్వాత ఫాంటసీ.. రియల్ లవ్‌తో థ్రిల్లింగ్‌గా కనిపిస్తోంది.
ఓ అమ్మాయి డైరీని ఫాలో అయ్యే హీరో కథగా సరి కొత్త నేపథ్యంలో ఈ మూవీని దర్శకుడు తెరకెక్కించాడు. ట్రైలర్ లోని విజువల్స్ హీరో హీరో హీరోయిన్ ల నేపథ్యంలో ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రేమ కథల్లో సరికొత్త కథగా ఈ సినిమా వుంటుందనే ఫీల్ ని ట్రైలర్ తో మేకర్స్ కలిగించడంలో సక్సెస్ అయ్యారు. విభిన్నమైన ప్రేమకథగా సాగనున్న ఈ మూవీకి గోపీ సుందర్ సంగీతం ఏ వసంత్ సినిమాటోగ్రఫీ నవీన్ నూలి ఎడిటింగ్ అదనపు ఆకర్షణగా నిలవనున్నాయి.
తాజా వార్తలు
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్‌లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ
- అర్జెంటీనాకు ఆరోగ్య సేవలను అందించనున్న భారత్
- హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతపై ఒమన్, ఖతార్‌తో కువైట్ విదేశాంగ మంత్రి చర్చలు
- ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
- సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక నిబంధనలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!







