ప్రపంచంలో 2వ అత్యుత్తమ నగరంగా దుబాయ్
- December 18, 2022
యూఏఈ: యూకే ఆధారిత మార్కెట్ రీసెర్చ్ కంపెనీ యూరోమానిటర్ విడుదల చేసిన కొత్త నివేదిక ప్రకారం.. 2022లో ప్రపంచంలోని అత్యుత్తమ 100 నగరాల్లో మొదటి 10 నగరాల్లో ఎమిరేట్ ఆఫ్ దుబాయ్ రెండవ స్థానంలో నిలిచింది. గత సంవత్సరంతో పోల్చితే దాదాపు రెట్టింపుతో ఈ సంవత్సరం 12 మిలియన్లకు పైగా అంతర్జాతీయ పర్యాటకులు దుబాయ్ ను సందర్శించారు. ప్రతి సంవత్సరం పర్యాటక విధానాలు, పనితీరు, సుస్థిరత, మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, భద్రత, ఆర్థిక పనితీరుతో సహా ఆరు రేటింగ్‌ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా 100 నగరాల జాబితాను యూరోమానిటర్ విడుదల చేస్తుంది. తాజా నివేదికలో పారిస్ వరుసగా రెండవ సంవత్సరం "టాప్ 100 సిటీస్ ఇండెక్స్ 2022"లోని టాప్ 10 నగరాల్లో మొదటి స్థానంలో నిలిచింది. దుబాయ్ తర్వాతి స్థానాలలో ఆమ్‌స్టర్‌డామ్, మాడ్రిడ్, రోమ్, లండన్, మ్యూనిచ్, బెర్లిన్, బార్సిలోనా వంటి యూరోపియన్ నగరాలు నిలిచాయి.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







