కమల్ సినిమాకు ఇళయరాజా టైటిల్ ..
- April 26, 2016
కమల్‌హాసన్-ఇళయరాజాలది ఓ సూపర్‌హిట్ కాంబినేషన్. కానీ, దాదాపు 11 ఏళ్లుగా కమల్ నటించిన ఏ చిత్రానికీ ఇళయరాజా పనిచేయలేదు. తాజాగా వీరిద్దరూ కలిసి మళ్లీ పనిచేస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం మంగళవారం చెన్నైలో జరిగింది. శ్రుతీహాసన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి టీకే రాజీవ్‌మీనన్ దర్శకుడు.విశేషమేమిటంటే, ఈ సినిమాకు నామకరణం ఇళయరాజానే చేశారట! పాతికేళ్ల క్రితం తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఓ చిత్రానికి 'గుణ' అనే టైటిల్ పెట్టింది కూడా ఇళయరాజానే. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కమల్ సినిమాకు ఇళయరాజా టైటిల్ సూచించారు. ఈ విషయాన్ని కమల్ స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. మరి ఈ సినిమా టైటిల్ ఏంటో చెప్పకుండా కమల్ సస్పెన్స్‌లో పెట్టారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







