వడదెబ్బకు హోమియో చికిత్స..
- April 26, 2016
హోమియో కౌన్సెలింగ్ఎండలు నానాటికీ ముదిరిపోతున్నాయి కదా, ఈ అధిక భానుడి తాపాన్ని తట్టుకుని, వడదెబ్బకు గురికాకుండా ఉండాలంటే ఎలాంటి ముందుజాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ వడదెబ్బకు గురయితే హోమియో చికిత్స ఏమి తీసుకోవాలి? దయచేసి వివరించగలరు. - ప్రవీణ్‌కుమార్, ఆదోని
వడడెబ్బ ఒక ప్రాణాంతకమైన పరిస్థితి అని చెప్పవచ్చు. ఏ వయస్సు వారినైనా ప్రభావితం చేసే ఈ వడదెబ్బ ఎక్కువగా చిన్న పిల్లలను, వృద్ధులలో ఎక్కువ. తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దీని బారిన పడకుండా కాపాడుకోవచ్చు.సాధారణంగా వాతావరణ ఉష్ణోగ్రత పెరిగినప్పుడు చెమట పట్టడం ద్వారా శరీరం సాధారణ ఉష్ణోగ్రతను కలిగి ఉండేలా చేస్తుంది. ఇలా ఎక్కువ సమయం ఎండని ఎదుర్కొన్నప్పుడు చెమట ద్వారా అధికమొత్తంలో నీరు, లవణాలను కోల్పోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఈ సమయంలో శరీరంలోని కణాలు రక్తంలోని నీటిని ఉపయోగించడం జరుగుతుంది. దీనివల్ల రక్తం పరిమాణం తగ్గి, గుండె, చర్మానికి, ఇత ర అవయవాలకు తగినంత రక్తప్రసరణ చేయలేకపోవడం వల్ల చర్మం యొక్క సహజమైన శీతలీకరణ వ్యవస్థ మందగించి శరీర ఉష్ణోగ్రత పెరగడం వల్ల వడదెబ్బ లక్షణాలు కనిపిస్తాయి.లక్షణాలు: ఎండదెబ్బ లక్షణాలు అకస్మాత్తుగా కనిపిస్తాయి. శరీర ఉష్ణోగ్రత పెరగడం, చర్మం పొడిబారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండెదడ, వాంతులు, వికారం, విరేచనాలు, కండరాల తిమ్మిర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. పరిస్థితి విషమిస్తే కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది.జాగ్రత్తలు: నీరు, ఇతర ద్రవపదార్థాలు అధికంగా తీసుకోవాలి. ఎక్కువ ఎండ తగలకుండా చూసుకోవాలి. ఒకవేళ ఎండలో వెళ్లాల్సి వస్తే వదులుగా ఉండే పల్చని, లేతరంగు దుస్తులు ధరించాలి. కాటన్ దుస్తులయితే మంచిది. తలపై ఎండ పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. మద్యపానం, కెఫీన్ కలిగిన పానీయాలు తీసుకోరాదు. అవి అధిక మూత్రవిసర్జన కలిగించడం ద్వారా డీహైడ్రేషన్‌కు గురిచేస్తాయి. కాబట్టి తీసుకోకపోవడం మంచిది. గాలి ప్రసరణ బాగా ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ ఎండదెబ్బకు గురయితే హోమియోలో తగిన మందులు వాడటం ద్వారా ప్రమాదం నుంచి బయటపడవచ్చు.- డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ ఫౌండర్ చైర్మన్,హోమియోకేర్
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







