TANA మెగా కార్యక్రమం విజయవంతం
- December 20, 2022
గుడివాడ: తానా చైతన్యస్రవంతి కార్యక్రమాల్లో భాగంగా తానా ఫౌండేషన్ కార్యదర్శి శశికాంత్ వల్లేపల్లి గుడివాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలు సూపర్ హిట్టయ్యాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, గౌరవ అతిథులుగా రావి వెంకటేశ్వర రావు, వర్ల కుమార్ రాజ, రోటరీ క్లబ్ గుడివాడ వారు పాల్గొన్నారు. తొలుత శశికాంత్ వల్లేపల్లి అతిధులను వేదిక మీదకు ఆహ్వానించారు.
కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ అమెరికాలో ఎవరి పనులు వారు చేసుకొంటూ, ఉద్యోగాలలో ఎదుగుతూ మరోవైపు తెలుగు రాష్ట్రంలో ఇంత పెద్ద స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వారిని అభినందించడంతోపాటు, వారికి అవసరమైన మద్దతును కూడా మనం ఇవ్వాలని కోరారు.
తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి మాట్లాడుతూ తానా ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న అనేక సహాయ కార్యక్రమాలను వివరించారు. 2 డిసెంబర్ నుంచి 4 జనవరి వరకు జరిగే తానా చైతన్య స్రవంతి కార్యక్రమాలలో చేపట్టిన కార్యక్రమాలను తెలియజేశారు.
తానా ఫౌండేషన్ చైర్మన్ వేంకట రమణ యార్లగడ్డ మాట్లాడుతూ తానా ఫౌండేషన్ ద్వారా ప్రతి సేవా కార్యక్రమానికి టార్గెట్స్ పెట్టుకొని వాటిని అధిగమిస్తున్నామని చెప్పారు. 1000 మంది కి స్కాలర్ షిప్‌లు ఇవ్వాలని అనుకొని ఇప్పటికే 1000 మంది ఇవ్వటం జరిగిందని, అలాగే 50 క్యాన్సర్ క్యాంప్ లు చేద్దామని టార్గెట్ పెట్టుకుంటే, ఇప్పటికే 48 క్యాంప్ లు చేశామని తెలిపారు. ఈ విధంగా ప్రతి సేవా కార్యక్రమానికి ఒక నంబర్ టార్గెట్ పెట్టుకొని చేస్తున్నామని, ఇంత పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయటానికి సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలపాలన్నారు.
తానా సెక్రెటరీ సతీష్ వేమూరి మాట్లాడుతూ తానా టీమ్ స్క్వేర్ ద్వారా అమెరికా లో ఆపద, విపత్కర సమయాలలో ఏ విధంగా సహాయం చేస్తున్నామో వివరించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా స్కూల్ విద్యార్థినులకు తానా చేయూత ద్వారా 55 మంది కి స్కాలర్ షిప్ లు, తానా ఆదరణ ప్రోగ్రాం ద్వారా 25 కుట్టు మిషన్ లు, 15 సైకిల్స్, 4 వీల్ చైర్స్ బహూకరించారు. నేత్రవైద్యశిబిరం, ఇఎన్‌టి, క్యాన్సర్ క్యాంప్‌లను ఏర్పాటు చేసి అనేకమందికి పరీక్షలు చేసి చికిత్స చేశారు.
ఈ కార్యక్రమంలో శశికాంత్ వల్లేపల్లి తండ్రి వల్లేపల్లి సీతారామ్మోహన్ రావు పేరు మీద రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ - రోటరీ కమ్యూనిటీ సర్వీస్ ట్రస్ట్, గుడివాడ వారికి 8,50,000 రూపాయల వ్యయంతో వైకుంఠ రథంను బహూకరించారు.
తానా నాయకులు సతీష్ వేమూరి, పురుషోత్తం గూడె, సునీల్ పాంత్రా, శశాంక్ యార్లగడ్డ, ఉమా కటికి, జోగేశ్వర రావు పెద్దిబోయిన, రాము వెనిగండ్ల, టాగోర్ మలినేని, రాజ కసుకుర్తి, రావు మొవ్వా, శ్రీనివాస్ ఓరుగంటి, నాగ పంచుమర్తి, రఘు ఎద్దులపల్లి, తెలుగు టైమ్స్ ఎడిటర్ సుబ్బారావు చెన్నూరి, టిఎన్ఐ లైవ్ ఎడిటర్ ముద్దు కృష్ణ నాయుడులను శశికాంత్ వల్లేపల్లి వేదిక మీదకు ఆహ్వానించి ఘనంగా సత్కరించారు.



తాజా వార్తలు
- యూఏఈ ఎమిరేట్స్ ఐడితో ఫ్రాడ్ రిస్క్..డేటా ప్రొటెక్షన్ గైడ్..!!
- ఇరాన్ దురాక్రమణ పై యూఎన్ఓలో బహ్రెయిన్ ఫైర్..!!
- ఉత్తర అల్ షర్కియాలో భారీగా పొగాకు ఉత్పత్తులు స్వాధీనం..!!
- సౌదీలో లేబర్ తనిఖీలు.. 80వేల సౌదీకరణ ఉల్లంఘనలు..!!
- కువైట్ లో నలుగురు ప్రవాసులకు, పీఏసీఐ అధికారికి జైలు శిక్ష..!!
- ఖతార్‌లో మూడవ దశలోకి హాట్ సీజన్..!!
- ఖతార్ ఎమిర్‌కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్‌లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట







