‘18 పేజెస్’ ఈవెంట్‌లో ఐకాన్ స్టార్ హల్‌చల్.!
- December 20, 2022
నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన ‘18 పేజెస్’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌లో లెక్కల మాస్టార్ సుకుమార్‌తో కలిసి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేశారు.
‘కార్తికేయ 2’ సినిమాతో మంచి విజయం అందుకున్న నిఖిల్‌కి ‘18 పేజెస్’ మరో మంచి సక్సెస్ అవ్వాలని ఈ సందర్భంగా అల్లు అర్జున్ కోరుకున్నారు.
అలాగే, తన సినిమా ‘పుష్ప 2’ గురించి కూడా ఈ సందర్భంగా అల్లు అర్జున్ కొన్ని అప్‌డేట్స్ ఇచ్చారు. నో డౌట్ ‘పుష్ప 2’ అంతకు మించిన లెవల్‌లో వుంటుంది. అస్సలు తగ్గేదేలే.. అని హింట్ ఇచ్చారు.
అలాగే, ఆల్రెడీ షూట్ స్టార్టయ్యిందనీ, ఐదు రోజుల షూట్ జరిగిందనీ సుకుమార్ చెప్పారు. ప్రతీ సీన్ ఎలివేషన్ కోసం అల్లు అర్జున్ చాలా కష్టపడుతున్నాడంటూ బన్నీ జపం కూసింత గట్టిగానే చేశాడు సుకుమార్ ఈ సందర్భంగా.
‘18 పేజెస్’ విషయానికి వస్తే, సుకుమార్ అందించిన కథతో పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కించిన మూవీ ఇది. ప్రచార చిత్రాలతో కూల్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అనే ఫీల్ తెప్పిస్తున్నారు. చూడాలి మరి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







