54 ఐపిఆర్ ఉల్లంఘనల్ని సీజ్ చేసిన దుబాయ్ కస్టమ్స్
- April 26, 2016
ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ (ఐపిఆర్) ఉల్లంఘనలకు వ్యతిరేకంగా దుబాయ్ కఠిన చర్యలు చేపట్టింది. దుబాయ్ కస్టమ్స్ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2015లో మొత్తం 135 సీజ్‌లు జరిగాయనీ, ఈ ఏడాది తొలి క్వార్టర్లో ఇప్పటికే 54 సీజ్‌లు జరిగాయని స్పష్టమవుతుంది. గత ఏడాది జరిగిన సీజ్‌ల విలువ 16.8 మిలియన్ దిర్హామ్‌లు కాగా, ఈ ఏడాది సీజ్ చేయబడినవాటి విలువ 34.5 మిలియన్ దిర్హామ్లని దుబాయ్ కస్టమ్స్ పేర్కొంది. దుబాయ్ కస్టమ్స్ - కస్టమర్ మేనేజ్మెంట్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అబ్దుల్లా అల్ ఖాజా మాట్లాడుతూ, కస్టమ్స్ సీజ్ చేసిన వస్తువులు దేశంలోకి ప్రవేశించినట్లయితే ఆరోగ్యం దెబ్బతినడంతోపాటు, ఎకానమీపైనా ప్రభావం చూపేదని అన్నారు. వరల్డ్ ఐపి డే సందర్భంగా ఖాజా మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ పైరసీ విపరీతంగా పెరిగిపోతోందని, మెనా రీజియన్‌లో వీటి కారణంగా ఆర్థిక నష్టాలు పెరుగుతున్నాయని చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







