విదేశీ ప్రయాణికులపై భారత్ ఆంక్షలు.. ఆ దేశాల వారికి ఆర్‌టి-పీసీఆర్ పరీక్ష తప్పనిసరి
- December 24, 2022
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు తిరిగి ప్రారంభం కావడంపై భారత ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ముఖ్యంగా కరోనా తీవ్రత అధికంగా ఉన్న ఐదు దేశాల నుండి వచ్చేవారికి ఆర్‌టి-పిసిఆర్ పరీక్షను తప్పనిసరి చేస్తున్నట్లు భారత ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రకటించారు. చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, థాయ్‌లాండ్‌కు చెందిన ప్రయాణికులకు ఈ నిబంధనలు వర్తిస్తాయని ఆయన స్పష్టం చేశారు. ప్రయాణికులలో పాజిటివ్‌గా తేలినా లేదా కోవిడ్-19 లక్షణాలను గుర్తించిన వారిని క్వారంటైన్‌కు తరలించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే వారి
ప్రస్తుత ఆరోగ్య స్థితిని ప్రకటించడానికి ఎయిర్ సువిధ ఫారమ్‌ను పూరించాల్సి ఉంటుందని తెలిపారు. నిన్న దేశంలోకి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకుల కోసం అప్డేట్ చేసిన కోవిడ్-19 మార్గదర్శకాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. దుబాయ్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా కూడా శుక్రవారం ట్విటర్‌లో కొత్త మార్గదర్శకాలను షేర్ చేసింది.
Latest guidelines for international arrival in India. pic.twitter.com/GBjQPTx64V
— India in Dubai (@cgidubai) December 23, 2022
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







