చిరు లీక్స్: ‘వీరయ్య’లో రవితేజ పాత్ర గురించి లీక్ చేసేసిన మెగాస్టార్.!
- December 28, 2022
మెగాస్టార్ చిరంజీవి నోటిలో అస్సలు మాట దాగనే దాగదు. ముఖ్యంగా తను నటించబోయే సినిమాలకు సంబంధించి. గతంలో చాలాసార్లు ఇలాగే జరిగింది. అనుకోకుండా చిరంజీవి లీక్ చేసేయడంతో, స్పెషల్‌గా రిలీజ్ చేయాల్సిన అప్డేట్స్ సాదా సీదాగా హడావిడిగా రిలీజ్ చేయాల్సిన సందర్భాలు అనేకం గతంలో చూశాం.
తాజాగా ‘వాల్తేర్ వీరయ్య’ గురించిన ఓ అసలు సిసలు లీక్ కూడా చిరంజీవి నోట్లోంచి బయటికి వచ్చేసింది. సంక్రాంతికి సినిమా రిలీజ్ వున్న నేపథ్యంలో ప్రమోషన్లు షురూ చేశారు. అందులో భాగంగానే, ‘వాల్తేర్ వీరయ్య’ సెట్లో ప్రత్యేకంగా ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి ఏమాత్రం తీసిపోకుండా వున్న ఈ ప్రెస్ మీట్‌కి చిత్ర యూనిట్ అంతా హాజరయ్యారు. సినిమాకి సంబంధించి పలు విషయాల్ని మీడియాతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి, రవితేజ పాత్ర సెకండాఫ్‌లో వస్తుంది.. అని నోరు జారేశారు. అయితే, యూనిట్ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదనుకోండి. రవితేజ పాత్రకి సంబంధించి కొంత సీక్రెట్ మెయింటైన్ చేస్తూ వచ్చారింతవరకూ. కానీ, చిరు లీక్స్‌తో ఆ సస్పెన్స్‌కి తెర పడిపోయిందిలా.!
తాజా వార్తలు
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు
- యూఏఈలో సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ఇంధన ధరలు
- కువైట్‌లో భారీగా మద్యం స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్..!!
- ఒమన్‌లో వైద్య ఫీజుల మినహాయింపు జాబితాలో మార్పులు..!!
- సౌదీలో తప్పుడు సమాచారం ఇస్తే ఐదేళ్ల జైలు..SR2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్‌లో వాట్సాప్ మెసేజ్‌లు, వాయిస్ మెసేజ్‌లు అప్పు ఆధారాలుగా పనికొస్తాయా?
- బహ్రెయిన్‌లో విషాదం.. బాత్‌టబ్‌లో పడి మూడేళ్ల భారతీయ బాలుడి మృతి..!!
- యూఏఈలో 52 మంది బిలియనీర్లు.. వీరి మొత్తం సంపద ఎంతంటే?
- యూఏఈలో భారతీయులకు బయోమెట్రిక్ డేటా మోసాలపై హెచ్చరిక







