తెలంగాణ ఇన్‌ఛార్జి డీజీపీగా అంజనీ కుమార్..
- December 29, 2022
హైదరాబాద్: తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఎల్లుండి పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఏసీబీ డీజీ అంజనీ కుమార్ ను రాష్ట్ర ఇన్చార్జి డీజీపీగా నియమిస్తూ సర్కారు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి స్థాయి డీజీపీ నియామకంపై పలు న్యాయపర కారణాల వల్ల ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.
మొత్తం ఆరుగురు ఐపీఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ ను సీఐడీ అడిషనల్ డీజీగా నియమిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు మహేశ్ భగవత్ రాచకొండ పోలీస్ కమిషనర్ గా కొనసాగారు. రాచకొండ కమిషనర్ గా దేవేంద్ర సింగ్ చౌహాన్ ను సర్కారు నియమించింది.
ఏసీబీ డీజీగా రవి గుప్తా నియమితుడయ్యారు. రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి డీజీగా జితేందర్ ను నియమించారు. శాంతి భద్రతల అదనపు డీజీగా సంజయ్ కుమార్ జైన్ నియామితుడయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







