‘బటర్ ఫ్లై’ అనుపమా.! ఆడియన్స్ సహనానికి పెద్ద పరీక్షే సుమా.!
- December 30, 2022
అందాల భామ అనుపమా పరమేశ్వరన్ కెరీర్ ఈ మధ్య రయ్ రయ్ మంటూ పరుగులు తీస్తోంది. బ్యాక్ టు బ్యాక్ రెండు సూపర్ హిట్లు తన ఖాతాలో వేసుకుంది ఈ మధ్య అనుపమా పరమేశ్వరన్.
‘కార్తికేయ 2’తో సెన్సేషనల్ హిట్ కొట్టిన అనుపమా, వెరీ లేటెస్టుగా ‘18 పేజెస్’తో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకుంది. తాజాగా ‘బటర్ ఫ్లై’ అనే సినిమాతో ఓటీటీలో ప్రత్యక్షమైంది అనుపమా పరమేశ్వరన్.
లేడీ ఓరియెంటెడ్ మూవీ ఇది. టైటిల్ చూసి ఆసక్తిగా అనిపించింది. కానీ, సినిమా మాత్రం ప్రేక్షకుల సహనానికి పరీక్ష అనే చెప్పొచ్చు. ఎంతో నమ్మకంగా వున్న పనిమనిషి కారణంగా అనుపమా అనుభవించిన స్ట్రగుల్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.
కాన్సెప్ట్ పాతదే అయినా, కథనం కొత్తగా చూపించి వుంటే బాగుండేది. కానీ, పక్కా బోరింగ్ బటర్ ఫ్టై. ఓటీటీ ప్రేక్షకులు ఈ మధ్య కాలంలో ఇంత బోరింగ్‌గా ఫీలైన సినిమా మరోటి లేదంటూ కామెంట్లు వస్తున్నాయ్. ఇంత డల్ అండ్ రొటీన్ కాన్సెప్ట్ అనుపమా ఎందుకు ఎంచుకున్నట్లో మరి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







