‘మైత్రి’ కారణంగా హర్టయ్యానంటోన్న నైజాం రాజు ‘దిల్’ రాజు.!
- December 30, 2022
నైజాంలో పెద్ద సినిమాలు రిలీజ్ చేయాలంటే ముందుండే డిస్ర్టిబ్యూటర్ దిల్ రాజు. కానీ, ఈ ఏడాది సంక్రాంతికి దిల్ రాజుకు నైజాంలో గట్టి షాకే తగిలిందని చెప్పొచ్చు. ఈ సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. బాలయ్య ‘వీర సింహారెడ్డి’, మెగాస్టార్ ‘వాల్తేర్ వీరయ్య’.
ఈ రెండూ ఒకే బ్యానర్ నుంచి రిలీజ్ అవుతున్న సినిమాలు. అదే మైత్రీ మూవీస్ మేకర్స్. నిజానికి ఇదో ప్రొడక్షన్ హౌస్. కానీ, ఇటీవలే డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ కూడా స్టార్ట్ చేసి, తమ సినిమాల్ని సొంతంగా రిలీజ్ చేసుకుంటోంది.
మరోవైపు తమిళ హీరో విజయ్‌తో దిల్ రాజు నిర్మించిన ‘వారసుడు’ మూవీ ధియేటర్ల ఇష్యూ ఇంకా నడుస్తూనే వుంది. ఆ సినిమాకి ఎంత చేసినా పెద్దగా బజ్ కూడా క్రియేట్ కావడం లేదు. దాంతో, మైత్రీ వాళ్లపై దిల్ రాజు అసూయ పడుతున్నట్లుగా తెలుస్తోంది.
ఈ మధ్య ఓ ఈవెంట్లో తన అసూయను చెప్పకనే చెప్పేసి బయటపడిపోయారు రాజుగారు. మైత్రీ వాళ్లు డిస్ర్టిబ్యూషన్ స్టార్ట్ చేయడం తనకెంతో ఆనందంగా వుందని పైకి చెప్పినా లోలోపల మాత్రం చాలా కుమిలిపోతున్నట్లు ఆయన ముఖంలో కనిపిస్తోందంటూ, నెట్టింటి వేదికగా కామెంట్లు షురూ అవుతున్నాయ్.
తాజా వార్తలు
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్‌లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..