యూఏఈలో జనవరి 3న భారీ ఉల్కాపాతం
- December 31, 2022
యూఏఈ: 2023 తొలి అరుదైన ఉల్కాపాతం చోటుచేసుకోనుంది. అద్భుతమైన జెమినిడ్స్ ఉల్కాపాతం తరువాత యూఏఈ నివాసితులకు జనవరి 3న క్వాడ్రాంటిడ్స్ ఉల్కాపాతం కనువిందు చేయనుంది. దుబాయ్ ఆస్ట్రానమీ గ్రూప్ ప్రకారం.. రాబోయే ఉల్కాపాతం వీక్షించడానికి అవకాశం ఉన్నవాటిల్లో ఒకటి. గంటకు గరిష్టంగా 110 ఉల్కల రేటును ఇది చేరుకుంటుంది. క్వాడ్రాంటిడ్స్ ఉల్కాపాతం జనవరి 5 వరకు కొనసాగుతుంది. జనవరి 3-4 తేదీల్లో రాత్రి సమయాల్లో గరిష్ట స్థాయికి చేరుకుంటాయని దుబాయ్ ఖగోళ శాస్త్ర గ్రూప్ జనరల్ మేనేజర్ షీరాజ్ అహ్మద్ అవాన్ తెలిపారు. ఉల్కాపాతాన్ని ఆస్వాదించాలనుకునే ఆకాశ వీక్షకుల కోసం దుబాయ్ ఖగోళ శాస్త్ర సమూహం ఆ రోజు రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజామున 4 గంటల వరకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఉల్కలు అనేది సెకనుకు 70 కిలోమీటర్ల వేగంతో మన గ్రహం వాతావరణంలోకి ప్రవేశించే శిధిలాల ముక్కలు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







