రాళ్ల ఉప్పుతో ఓవర్ వెయిట్‌కి, సైనస్‌కి చెక్..

- December 31, 2022 , by Maagulf
రాళ్ల ఉప్పుతో ఓవర్ వెయిట్‌కి, సైనస్‌కి చెక్..

రాళ్ల ఉప్పుతో ఓవర్ వెయిట్‌కి, సైనస్‌కి చెక్..ఉప్పులేని కూర చప్పగా ఉంటుంది.. ఎన్ని రుచికరమైన పదార్థాలు వేసినా కాస్త ఉప్పు తక్కువైతే ఆ వంటకం రుచే మారిపోతుంది.. మరి ఎక్కువైతేనో.. ఆరోగ్యానికి అనర్థం. అయితే పాల నురుగులా తెల్లగా ఉండే ఉప్పుకంటే రాక్ సాల్ట్ (రాళ్ల ఉప్పు) శరీరానికి ముప్పును తగ్గిస్తుందంటున్నారు పరిశోధకులు.

పైగా ఇది శరీరానికి మేలు చేస్తుంది.. ఎలాంటి హాని ఉండదని చెబుతున్నారు. రాతి ఉప్పును అనేక పేర్లతో పిలుస్తారు. హిమాలయన్ ఉప్పు, లాహోరీ ఉప్పు, హాలైడ్ క్లోరైడ్ అని కూడా అంటారు. అదే సమయంలో ఇతర లవణాలతో పోలిస్తే ఈ ఉప్పులో ఇనుము తక్కువగా ఉంటుంది. దాదాపు 90% ఖనిజాలు ఉంటాయి. వీటితో పాటు కాల్షియం, పొటాషియం, జింక్ వంటి మూలకాలు కూడా ఉన్నాయి.

బీపీ డౌన్ అయి శరీరం నీరసించి పోతే మజ్జిగలో ఉప్పు వేసుకుని తాగమంటారు. అయితే, ఈ సాదా ఉప్పు శరీరానికి చాలా హాని కలిగిస్తుంది. అటువంటి పరిస్థితిలో రాతి ఉప్పును ఉపయోగించడం అని విధాల శ్రేయస్కరం. ఇది మీ BP ని అదుపులో ఉంచుతుంది, గుండె సమస్య ఉండదు, కొలెస్ట్రాల్ ఇబ్బంది పెట్టదు. ఒత్తిడిని తగ్గిస్తుంది. నిజానికి, ఇందులో ఉండే మూలకాలు సెరోటోనిన్, మెలటోనిన్ రసాయనాలను సమతుల్యం చేస్తాయి. ముఖ్యంగా డిప్రెషన్ వంటి సమస్యలతో పోరాడేవారికి సహాయం చేస్తుంది.

బరువుని నియంత్రణలో ఉంచుతుంది. ప్రస్తుతం చాలా మంది ఊబకాయం బారిన పడుతున్నారు. అటువంటి పరిస్థితిలో, తెల్ల ఉప్పుకు బదులు రాతి ఉప్పును ఉపయోగిస్తే, అది మీ బరువును తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. నిజానికి, ఇందులో ఉండే పదార్థాలు అదనపు కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి.

వ్యాధుల నుండి విముక్తి. నిద్రలేమి, ఉబ్బసం, మధుమేహం, కిడ్నీలో రాళ్లు వంటి సమస్యలకు రాళ్ల ఉప్పు తీసుకోవడం ఉత్తమం. సైనస్- సైనస్ వ్యాధి పిల్లలలో ఎక్కువగా కనిపిస్తుంది. రాక్ సాల్ట్ వినియోగం శ్వాసకోశ వ్యాధుల ప్రమాదాన్ని నివారిస్తుంది. నోట్: నెట్‌లో వివిధ హెల్త్ వెబ్‌సైట్లలో నిపుణులు సూచించిన సమాచారం మేరకు వివరించడం జరిగింది. మీ ఆరోగ్యం దృష్ట్యా డాక్టర్లు సూచించిన మేరకు నడుచుకోవాలి. పై సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com