సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి లేఖ

- December 31, 2022 , by Maagulf
సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి లేఖ

హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ..సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాసారు. రైతులు ఎంతో విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, పత్తికి గిట్టుబాటు ధర కల్పించాలని, రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రేవంత్ రెడ్డి లేఖ రాశారు. పంటలకు మద్దతు ధర దక్కకుండా దళారులు రైతులను మోసం చేస్తుంటే ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని మండిపడ్డారు. వారి సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకుంటే రైతులు మరెవరితో చెప్పుకోవాలని ప్రశ్నించారు.

పత్తి క్వింటాలుకు రూ.6 వేల నుంచి రూ.7 వేలు మాత్రమే చెల్లిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని, కనీసం రూ.15 వేలు రాకుంటే గిట్టుబాటు కాదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల రోజుకు ఇద్దరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, జాతీయస్థాయిలో రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగోస్థానంలో ఉందని నేషనల్ క్రైమ్ బ్యూరో చెబుతోందని వివరించారు. రాష్ట్రంలో సరైన వ్యవసాయ విధానం లేకపోవడంతో రైతులు సంక్షోభంలో చిక్కుకున్నారని రేవంత్ విమర్శించారు. కౌలు రైతులను గుర్తించి, వారికి అందే అన్ని రకాల రకాలు అమలు చేయాలని లేఖలో కోరారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవడానికి, ప్రైవేటు అప్పుల విషయంలో వన్ టైం సెటిల్మెంట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com