26వ అఖిల భారత నాటకోత్సవాలు
- April 28, 2016
తెలుగు సినిమా తనకు అమ్మలాంటిదని, తెలుగు నాటక రంగం పెద్దమ్మ లాంటిదని ప్రముఖ సినీ నటుడు,'మా'అధ్యక్షుడు నటకిరీటి రాజేంద్రప్రసాద్ అన్నారు. గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం పల్లెకోనలో పరుచూరి రఘుబాబు స్మారకార్థం నిర్వహిస్తున్న 26వ అఖిల భారత నాటకోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఏడురోజులపాటు ఈ నాటకోత్సవాలు జరుగుతాయి. ఈ సభలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఏ వేదిక అయితే తమకు గుర్తింపునిచ్చిందో దాన్ని మరువకుండా నాటక కళాపరిషత్తులు నిర్వహించడం అభినందనీయమన్నారు. నాటకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు పరుచూరి బ్రదర్స్ పడుతున్న శ్రమ శ్లాఘనీయమన్నారు. పరుచూరి రఘుబాబు పరమపదించి 26 ఏళ్లయినా నిజమైన హీరోగా వెలుగొందుతున్నారని చెప్పారు.ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మాట్లాడుతూ మానసిక రుగ్మతలను సైతం నయం చేసి మనిషిని తేజోవంతం చేసే గుణం నాటకానికి ఉందన్నారు. తొలుత పరుచూరి రఘుబాబు చిత్రపటానికి వెంకటేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సభలో స్థల దాత వేములపల్లి సుబ్బారావు, వేద గంగోత్రి ఫౌండేషన్ చైర్మన్, హైకోర్టు అడ్వకేట్ జీవీఎన్‌ఆర్‌ఎస్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తొలిరోజు అమరావతి ఆర్ట్స్ గుంటూరు వారి 'జీవితార్ధం' నాటకం, అరవింద ఆర్ట్స్ తాడేపల్లి వారి 'రంకె' నాటిక, లిఖిత సాయి క్రియేషన్స్ గోవాడ వారి 'పంపకాలు'నాటిక ప్రదర్శించారు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







