మే 1వ తేదీన వారణాశిలో 11 ఈ-బోట్లను ఆవిష్కరించనున్నా మోదీ.
- April 28, 2016
భారతదేశంలోనే మొదటిసారిగా ఈ-బోట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ-పడవలను ఆయన సొంత నియోజకవర్గమైన ఉత్తరప్రదేశ్‌లోని వారణాశిలో వచ్చే ఆదివారం ప్రారంభించనున్నారు. హెరిటేజ్ సిటీగా పేరొందిన వారణాశిలో కాలుష్యం తగ్గించేందుకు ఓ ప్రయత్నంగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.
మే 1వ తేదీన మోదీ వారణాశిలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా గంగా ఘాట్ వద్ద ఉన్న నిషాద్ కమ్యూనిటీ వారితో ఆయన మాట్లాడతారు. తొలి దశలో 11 ఈ-బోట్లను ఆవిష్కరించనున్నారు. సంప్రదాయ పడవల స్థానంలో బ్యాటరీలతో నడిచే ఈ- పడవలను భర్తీ చేయనున్నారు. సంవత్సరంలోపు దాదాపు 3వేల ఈ- పడవలను ప్రవేశపెట్టడం లక్ష్యం.ఈ పడవలకు తెడ్డు వేసే పని ఉండదు. స్టీరింగ్ తిప్పితే చాలు. సౌరశక్తితో చార్జి అయ్యే బ్యాటరీలతో ఇవి నడుస్తాయి. వంద శాతం పర్యావరణానికి హాని కలిగించని విధంగా వీటిని రూపొందించారు. డీజిల్ ఇంజిన్ ఉండదు కాబట్టి ఇవి నడిచేటప్పుడు శబ్దం కూడా చాలా తక్కువగా ఉంటుంది.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







