‘అమిగోస్’ నుంచి ‘డోపిల్ గ్యాంగర్ 2’ వచ్చేశాడహో.!
- January 04, 2023
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘అమిగోస్’. టైటిల్‌తోనే ఎక్కడా లేని ఆసక్తి రేకెత్తించిన కళ్యాణ్ రామ్, ఈ సినిమాకి సంబంధించిన ప్రతీ అంశంతోనూ విపరీతమైన క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నాడు.
మనిషిని పోలిన మనిషి అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా కథ వుండబోతోందని ఇప్పటికే హింట్ ఇచ్చాడు కళ్యాణ్ రామ్. అందులో భాగంగానే ‘డోపిల్ గ్యాంగర్ 1 సిద్దార్ధ్’ అంటూ తన పాత్రను పరిచయం చేశాడు. అలాగే తనలాంటి ఇంకో వ్యక్తి వున్నాడనీ త్వరలోనే ఆ వ్యక్తి క్యారెక్టర్ రివీల్ అవుతుందని కొన్ని రోజుల క్రితం ప్రకటించిన కళ్యాణ్ రామ్, లేటెస్ట్గా ఆ రెండో వ్యక్తి పాత్రను పరిచయం చేశాడు.
‘డోపిల్ గ్యాంగర్ 2 మంజునాధ్’ అంటూ, ఆ రెండో వ్యక్తి పాత్రను పరిచయం చేశాడు. ఇక్కడే ఇంకో ట్విస్ట్ ఇచ్చాడు కళ్యాణ్ రామ్. ‘ఇంకొకడున్నాడు’ అని. మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురుంటారు.. అని మన పెద్దలు చెబుతుంటారు. బహుశా అదే కాన్సెప్ట్‌తో ‘అమిగోస్’ రూపు దిద్దుకుంటోంది కాబోలు. ఒకరు, ఇద్దరు, ముగ్గురు కాదు. ఏకంగా ఏడుగురూ వుంటారేమో. ఇంట్రెస్టింగ్ కదా.! లెట్స్ వెయిట్ అండ్ సీ.!
తాజా వార్తలు
- తెలంగాణలో మార్పు మొదలైంది: కేటీఆర్
- ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మహిళా కమిషన్ విచారణలో శివాజీ క్షమాపణలు
- బ్యాంక్ సెలవుల జాబితా విడుదల
- చైనా: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్‌లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!







