‘బిగ్‌’షాక్: అనారోగ్యంతో బాధపడుతున్న పునర్నవి భూపాళం.! ఏమైందంటే.!

- January 04, 2023 , by Maagulf
‘బిగ్‌’షాక్: అనారోగ్యంతో బాధపడుతున్న పునర్నవి భూపాళం.! ఏమైందంటే.!

 బిగ్‌బాస్ బ్యూటీ పునర్నవి భూపాళం‌కు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బిగ్‌బాస్ మూడో సీజన్‌లో పునర్నవి సృష్టించిన వైబ్స్ అంతా ఇంతా కాదు. అప్పటికే ‘ఉయ్యాల జంపాలా’ సినిమాతో వెండితెర తెరంగేట్రం చేసిన పునర్నవి, బిగ్‌బాస్ ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయింది.
ఒక్క మాటలో చెప్పాలంటే, ఆ సీజన్‌కి పునర్నవి హైలైట్ అంటే అతిశయోక్తి కాదేమో. అంతలా ఇమేజ్ తెచ్చుకుంది. బిగ్‌బాస్‌కి వచ్చిన క్రేజ్‌తో ఆ తర్వాత పునర్నవికి వరుస ఆఫర్లు క్యూ కట్టాయ్.
అయితే ఒకట్రెండు సినిమాల్లో మాత్రమే నటించిన పునర్నవి, పై చదువుల కోసం విదేశాలకు వెళ్లిపోయింది. దాంతో, సినిమాలకు తాత్కాలికంగా దూరమైపోయింది. ఇటీవలే విదేశాల నుంచి తిరిగొచ్చిన పునర్నవి సడెన్‌గా అనారోగ్యం బారిన పడినట్లు తెలుస్తోంది.
ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో పునర్నవి బాధపడుతోందట. తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది పునర్నవి. ఈ న్యూస్ తెలిసిన పునర్నవి ఫ్యాన్స్ ఆమె తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా పునర్నవికి ధైర్యం చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com