ఏపీలో గీతం మెడికల్ కాలేజీ కూల్చివేత
- January 06, 2023
విశాఖపట్నం: విశాఖ లోని గీతం మెడికల్ కాలేజీ కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. నిబంధనలకు పాటించకుండా నిర్మాణం జరిగిందని కూల్చివేతకు నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం తెల్లవారు జామునుండి కూల్చివేత పనులు మొదలుపెట్టారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఈ కూల్చివేత పనులు చేపట్టారు. .
ఉదయం ఆ ప్రాంతం మీదు వెళ్లే ప్రయాణికులు, ప్రజలు ఒక్కసారి షాక్ అయ్యారు. రాత్రికి రాత్రే ఇలా బారికేడ్లు పెట్టి రాకపోకలకు అంతరాయం కల్పించడంపై అసహనం వ్యక్తం చేశారు. ఎండాడ, రుషి కొండవైపు రాకపోకలు నిలిపేశారు. ఎందుకు ఇదంతా చేస్తున్నారో అనే సమాచారం మాత్రం ఎవరికీ తెలియక తికమక పడ్డారు.
గీతం యాజమాన్యం కూడా తమకు ఎలాంటి సమాచారం లేదని చెబుతోంది. పోలీసులు ఎందుకు వచ్చారో కూడా తమకు తెలియదని చెబుతోంది. ఈ హైడ్రామా కొనసాగిన కాసేపటికి ఆర్డీవో ఆధ్వర్యంలో నిర్మాణాలు తొలగింపు చేపట్టారు. దీంతో విషయం అందరికీ అర్థమైంది. ఈ కట్టడాల తొలగింపునకు గతంలోనే ప్రభుత్వం యత్నించింది. అనుమతికి మించి ఈ కట్టడాలు నిర్మించారని ప్రభుత్వం ఆరోపించింది. అందుకే కట్టడాలను కూల్చేస్తున్నట్టు అప్పట్లో పేర్కొంది. దీని పై కోర్టుకు వెళ్లిన గీతం యాజమాన్యం స్టే తెచ్చుకుంది. ఆ స్టే గడువు ముగియడంతో ఇప్పుడు మరోసారి నిర్మాణాలు పడగొట్టేందుకు అధికారులు సమాయత్తమయ్యారు.
తాజా వార్తలు
- కువైట్ అమీర్‌ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్‌పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్‌ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







