ప్రపంచంలోని 10 సురక్షితమైన నగరాల్లో అబుధాబి, దుబాయ్, షార్జా, అజ్మాన్
- January 07, 2023
యూఏఈ: 2023 సంవత్సరానికి ప్రపంచంలోని 10 సురక్షితమైన నగరాల జాబితాలో అబుధాబి, దుబాయ్, షార్జా, అజ్మాన్ నగరాలు నిలిచాయి. http://numbeo.com నివేదిక ప్రకారం అబుధాబి మొదటి స్థానంలో నిలువగా అజ్మాన్ నాల్గవ స్థానంలో, షార్జా, దుబాయ్లు వరుసగా 5, 7 స్థానాల్లో నిలిచాయి. భద్రత, స్థిరత్వం, శ్రేయస్సు అంశాల ఆధారంగా ప్రపంచ వ్యాప్తంగా నగరాలకు రేటింగ్లు ఇచ్చి సురక్షితమైన నగరాల జాబితాను రూపొందించారు.
అజ్మాన్ పోలీసు కమాండర్-ఇన్-చీఫ్ మేజర్ జనరల్ షేక్ సుల్తాన్ బిన్ అబ్దుల్లా అల్ నుయిమి, ఫెడరల్ సుప్రీం కౌన్సిల్ సభ్యుడు హిస్ హైనెస్ షేక్ హుమైద్ బిన్ రషీద్ అల్ నుయిమి మాట్లాడుతూ.. అజ్మాన్ సాధించిన భద్రతకు ర్యాంకింగ్ లభించిందని పేర్కొన్నారు. నేరాలను తగ్గించడానికి, రోడ్లపై ట్రాఫిక్ భద్రతను పెంపొందించడానికి, అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన ప్రతిస్పందన, అధిక-నాణ్యత సేవలను అందించడానికి అజ్మాన్ పోలీసులు అనేక భద్రతా ప్రాజెక్టులు, కార్యక్రమాలను అమలు చేశారని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







