దోహాలో జనవరి 19 నుండి హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

- January 08, 2023 , by Maagulf
దోహాలో జనవరి 19 నుండి హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

దోహా: జనవరి 19 నుంచి 28 వరకు ఖతార్ బెలూన్ ఫెస్టివల్ జరుగనుంది. ఈ వేడుకలో దాదాపు యాభై వరకు వివిధ రకాల హాట్ ఎయిర్ బెలూన్‌లు సందడి చేయనున్నాయి. ఓల్డ్ దోహా పోర్ట్‌లోని కొత్త వేదిక వద్ద ఈ పండుగ జరుగుతుంది. ఫెస్టివల్ మూడవ ఎడిషన్ సందర్భంగా ప్రపంచం నలుమూలల నుండి సందర్శకులు పాల్గొని హాట్ ఎయిర్ బెలూన్‌లను ఎంజాయ్ చేయవచ్చని ఈవెంట్ నిర్వాహకులు తెలిపారు.

 బెల్జియం నుండి లెన్ని కాంట్ తన స్ట్రాబెర్రీ-నేపథ్య హాట్ ఎయిర్ బెలూన్‌తో వస్తారన్నారు. అలాగే జర్మనీకి చెందిన టోర్‌స్టెన్ స్ప్రెంగర్, అతని సన్‌ఫ్లవర్ హాట్ ఎయిర్ బెలూన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. టర్కీ నుండి గీర్ట్ వాన్ వుల్వెలేర్ తన గుండె ఆకారంలో ఉన్న బెలూన్‌ని తీసుకువస్తాడని తెలిపారు. బ్రెజిల్ నుండి వార్లీ మాసిడో( నీలి పక్షి నేపథ్య బెలూన్‌), బ్రెజిల్ నుంచి మురిలో పెరీరా గోన్కాల్వ్స్(ఆకుపచ్చ మంత్రగత్తె బెలూన్‌),  యునైటెడ్ కింగ్‌డమ్ నుండి లీ హూపర్(గ్రహాంతర  బెలూన్‌), యూకే నుంచి ఆష్లే మూర్(తోడేలు బెలూన్‌) ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తారని నిర్వాహకులు వెల్లడించారు. బెలూన్ ఫ్లైట్‌ను ఆసక్తిగల వ్యక్తులు మార్చి 20 వరకు ప్రతి వ్యక్తికి QR499 తగ్గింపు రుసుముతో రిజర్వ్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ టిక్కెట్తో 30 నుండి 45 నిమిషాల పాటు బెలూన్ ట్రిప్‌ను ఎంజాయ్ చేయవచ్చన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com