బుఖాలో 93మీ వర్షపాతం.. పర్యాటకుల బృందాన్ని రక్షించిన అధికారులు
- January 08, 2023
మస్కట్: గత మూడు రోజులుగా అనేక గవర్నరేట్లలో భారీ నుండి మోస్తరు వర్షాలు కురిశాయని సివిల్ ఏవియేషన్ అథారిటీ (CAA) వెల్లడించింది. ఖాసబ్‌లోని విలాయత్‌లోని ఒక వాడిలో ముగ్గురితో కూడిన కుటుంబాన్ని, ముసండం గవర్నరేట్‌లోని మరొక వాడిలో కారులో చిక్కుకుపోయిన పర్యాటకుల బృందాన్ని రక్షించినట్లు సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ ప్రకటించింది. పౌరులు, నివాసితులు జాగ్రత్తగా ఉండాలని, వాడీలను దాటడం ప్రమాదకరమని, లోతట్టు ప్రదేశాల నుండి దూరంగా ఉండాలని, ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించడానికి అధికారిక సూచనలు ఫాలో కావాలని కోరారు.
వ్యవసాయ, మత్స్య మరియు జలవనరుల మంత్రిత్వ శాఖ (MAFWR) ప్రకారం.. జనవరి 6 నుండి 8 వరకు బుఖా మూడు రోజుల్లో 93 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. శుక్రవారం నుండి ఆదివారం వరకు MAFWR రెయిన్ మానిటరింగ్ స్టేషన్ల నుండి సేకరించిన సమాచారం ప్రకారం.. ఖాసబ్లో 81 మిమీ, లివా 62 మిమీ, షినాస్ 42 మిమీ, మాధా 34 మిమీ, సోహర్ 18 మిమీ, నఖల్ 14 మిమీ, ఖబౌరా 11 మిమీ, సహమ్ 8 మిమీ , వాడి అల్ 5 మిమీ , మహ్వాల్ 6 మిమీ, సీబ్ 3 మిమీ, రుస్తాక్ 3 మిమీ, ముస్సానా 2 మిమీ వర్షపాతం నమోదైంది.
తాజా వార్తలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్‌కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్..
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX ఎమిరేట్స్ గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్‌తో కూడిన ఈ-పాస్‌పోర్ట్‌లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్‌కుమార్ బొల్లా..!!







