అల్ లాజీ సరస్సును పరిశీలించిన అల్ అస్ఫూర్

- January 08, 2023 , by Maagulf
అల్ లాజీ సరస్సును పరిశీలించిన అల్ అస్ఫూర్

బహ్రెయిన్: రాజ్యంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వరదల నియంత్రణ చర్యలను ఉత్తర గవర్నర్ అలీ బిన్ షేక్ అబ్దుల్ హుస్సేన్ అల్ అస్ఫూర్ సమీక్షించారు. వరద నీటి తొలగింపునకు అధిక సామర్థ్యం గల పంపులను వ్యవస్థాపించి, వర్షపు నీటి పారుదల మార్గాలకు వాటిని కనెక్ట్ చేసినందుకు వర్క్స్ మంత్రిత్వ శాఖకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా అల్ లాజీ సరస్సు సామర్థ్యాన్ని పెంచడానికి, వర్షపు నీటి కాలువలు, కాలువల విస్తరణ కోసం చేపట్టిన పనుల పురోగతిని అల్ అస్ఫూర్ పరిశీలించారు. ఉత్తర గవర్నర్ హమద్ టౌన్‌లోని అల్ లాజీ ప్రాంతం, సరస్సును సందర్శించి వర్షాల వల్ల ప్రభావితమైన ప్రాంతాల భద్రతను అడిగి తెలుసుకున్నారు. ప్రజల భద్రతను నిర్ధారించేందుకు అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా జారీ చేసిన ఆదేశాలపై కూడా అధికారుతో సమీక్షించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com