11వ అంతస్తు ఫ్లాట్ నుండి పడి వ్యక్తి మృతి
- January 09, 2023
యూఏఈ: ఆదివారం ఉదయం షార్జాలోని అల్ నహ్దాలో భవనం 11వ అంతస్తు నుంచి పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు షార్జా పోలీసులు తెలిపారు. పోలీసు ఆపరేషన్స్ గదికి తెల్లవారుజామున ఆఫ్రికన్ జాతీయతగా భావించే వ్యక్తి మరణించినట్లు నివేదిక అందింది. వెంటనే ఆపరేషన్ గది అంబులెన్స్, పెట్రోలింగ్ బృందాలను పంపింది. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు.. అప్పటికే అతను మృతి చెందినట్లు గుర్తించారు. అతని మరణానికి కారణాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు కోసం బాధితుడి మృతదేహాన్ని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి తరలించారు. ప్రస్తుతం విచారణలో భాగంగా అతడు పడిపోయిన అపార్ట్మెంట్లో ఉన్న పలువురిని విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు







