టీడబ్ల్యూఏ ఖతార్ రక్తదాన శిబిరం సక్సెస్
- January 09, 2023
దోహా: తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ ఖతార్ ఆధ్వర్యంలో హమద్ మెడికల్ కార్పొరేషన్ అండ్ బ్లడ్ డోనార్ సెంటర్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన మూడవ రక్తదాన శిబిరంలో102 మంది దాతలు పాల్గొన్నారు. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపైన్ కి ముఖ్య అతిధులుగా వినోద్ వీ నాయర్(ICBF తాత్కాలిక అధ్యక్షులు), సబిత్ సాహిర్ (ICBF ప్రధాన కార్యదర్శి), మహమ్మద్ కున్హి (కల్చరల్ ఫోరమ్ ఖతార్), జాకిర్ హుస్సేన్ (Fly Now ట్రావెల్స్), మహమ్మద్ షరీఫ్ (TWA Toastmasters అధ్యక్షులు) హాజరయ్యారు.రక్త దానం చేసిన వారందరికీ టీడబ్ల్యూఏ సర్టిఫికెట్స్ అందజేశారు.
ఈ కార్యక్రమానికి స్పాన్సర్లుగా వ్యవహరించిన ఫ్లై నౌ ట్రావెల్స్, కోనసీమ హైదరాబాద్ రెస్టారెంట్,మీడియా పార్ట్నర్ మా గల్ఫ్.కామ్, రేడియో పార్టనర్ 106.3 FM రేడియో ఆలివ్, వారికి టీడబ్ల్యూఏ అధ్యక్షులు ఖాజా నిజాముద్దీన్ ధన్యవాదాలు తెలియజేశారు.ఈ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ లో టీడబ్ల్యూఏ మనగెమెంత్ కమిటీ, సబ్ కమిటీ, అడ్విసోరీ కమిటీ పాల్గొన్నారు.ఈ క్యాంపైన్ విజయవంతం కావడానికి కృషి చేసిన గులాం రస్సోల్, అబ్దుల్ రవూఫ్, మహమ్మద్ షోయబ్, నవీద్ దస్తగిరి, నాగరాజు, రమేష్ పిట్ల, మహమ్మద్ సలావుద్దీన్, మహమ్మద్ తహ, స్వరాజ్ కుమార్, కృష్ణ ప్రసాద్, రమేష్ నేతాజీ,జబ్బార్, అమీర్, నదీమ్, వసీం, అస్మత్, అజీమ్, ఒవైసీలకు ధన్యవాదాలు తెలిపారు.టీడబ్ల్యూఏ టోస్ట్మాస్టర్స్ క్లబ్ సభ్యులు ఆసిఫ్ దద్వాడ్, ఫిరోజ్ పాషా, మీర్ యావర్ అలీ, గులామ్ గౌస్, పృధ్వీ కారుమూరిలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- జనవరి 2 నుంచి విజయవాడలో బుక్ ఫెస్టివల్
- అక్టోబర్ లో ఇంపోర్ట్స్ లో బహ్రెయిన్ రికార్డు..!!
- దాడిని ఖండించిన ఎనిమిది అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- యూఏఈ అస్థిర వాతావరణం..భారీ వర్షాలు..!!
- భారత్ ఆర్కియాలజీ గ్యాలరీలో కువైట్ వస్తువులు..!!
- కస్టమ్స్ పోర్టులలో 1,145 అక్రమ వస్తువులు సీజ్..!!
- కీలక ఖనిజాల అన్వేషణ కోసం ఒమన్ రోడ్ మ్యాప్..!!
- రాచకొండ పోలీసులను అభినందించిన డిజిపి బి.శివధర్ రెడ్డి
- ఏపీ: లోక్ అదాలత్ 2 లక్షల కేసుల పరిష్కారం
- పెమ్మసానికి కీలక బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు







